indian cricketers: 90 ఏళ్లలో 12 మంది భారత క్రికెటర్లకే సాధ్యమైన టెస్ట్ రికార్డు
- 100 టెస్ట్ ల క్లబ్ లో 71 మంది క్రికెటర్లు
- భారత్ నుంచి 12 మందికి చోటు
- సచిన్ పేరిట 200 టెస్ట్ మ్యాచ్ ల రికార్డు
- తాజాగా కోహ్లీకి ఇందులో చోటు
ఏ క్రికెటర్ కు అయినా తన కెరీర్ లో 100 టెస్ట్ మ్యాచ్ ల మైలురాయిని చేరుకోవడం నిజంగా విశేషమైనది. విరాట్ కోహ్లీ శుక్రవారంతో ఈ అరుదైన రికార్డును నమోదు చేశాడు. 100 టెస్ట్ మ్యాచ్ ల క్లబ్ లోకి చేరిపోయాడు. ఎంతో నిలకడగా రాణిస్తే తప్ప ఒక క్రికెటర్ కు ఎక్కువ అవకాశాలు రావు. అందుకే ప్రతిభావంతులకే ఈ రికార్డు పరిమితమవుతోంది.
సెంచురీ టెస్ట్ మ్యాచ్ లు ఆడిన వారు
క్రికెటర్ | ఆడిన మ్యాచ్ లు | చేసిన పరుగులు | తీసిన వికెట్లు |
సచిన్ | 200 | 15921 | 46 |
రాహుల్ ద్రవిడ్ | 163 | 13265 | 1 |
వీవీఎస్ లక్ష్మణ్ | 134 | 8781 | 2 |
అనిల్ కుంబ్లే | 132 | 2506 | 619 |
కపిల్ దేవ్ | 131 | 5248 | 434 |
సునీల్ గవాస్కర్ | 125 | 10122 | 1 |
దిలీప్ వెంగ్ సర్కార్ | 116 | 6868 | 0 |
సౌరవ్ గంగూలీ | 113 | 7212 | 32 |
ఇషాంత్ శర్మ | 104 | 785 | 311 |
హర్బజన్ సింగ్ | 103 | 2224 | 417 |
వీరేంద్ర సెహ్వాగ్ | 103 | 8503 | 40 |
విరాట్ కోహ్లీ | 100 | - | - |