uno: యుద్ధంపై దర్యాప్తునకు ఐరాస కమిటీ... ఈ సారీ భారత్ వైఖరి అదే!
- ఉక్రెయిన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనను తేల్చేందుకు కమిటీ
- యూఎన్హెచ్ఆర్సీ ప్రతిపాదన మేరకు కమిటీ
- కమిటీ ఏర్పాటునకు జరిగిన ఓటింగ్
- ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయిన భారత్
ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధంలో మానవ హక్కులకు ఉల్లంఘన జరిగిందా? లేదా? అన్న విషయాన్ని తేల్చేందుకు ఐక్యరాజ్యసమితి ఓ కమిటీని నియమించింది. ఐరాస మానవ హక్కుల సంఘం (యూఎన్హెచ్ఆర్సీ) చేసిన ప్రతిపాదన మేరకు ఈ విషయంపై దర్యాప్తునకు ఓ అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన ఐరాస.. దర్యాప్తునకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇదిలా ఉంటే.. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న యుద్ధంపై తటస్థ వైఖరిని అవలంబిస్తూ వస్తున్న భారత్.. తాజాగా ఐరాస మానవ హక్కుల సంఘం విచారణ కమిటీ ఏర్పాటుపైనా అదే వైఖరితో ముందుకు సాగింది. కమిటీ విచారణ అవసరమా? లేదా? అన్న విషయాన్ని తేల్చేందుకు ఐరాస ఓటింగ్ నిర్వహించగా... భారత్ ఎటువైపు ఓటు వేయకుండా ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయింది.