Raghurami Reddy: ప్రైవేటు పాఠశాలల్లో చదివేవారికి అమ్మఒడి పథకం ఎందుకు?:వైసీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి

Amma Odi should not be given to those who study in private schools says YSRCP MLA Raghurami Reddy
  • డబ్బులున్నవారే ప్రైవేటు పాఠశాలల్లో చదువుతారు
  • వారికి అమ్మఒడి ఇవ్వడం అనవసరం
  • ఐసీడీఎస్ పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది
ఏపీ ప్రభుత్వం అమ్మఒడి పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ పథకం అమలుపై మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అమ్మఒడి డబ్బులు ఇవ్వడం సరికాదని ఆయన అన్నారు. డబ్బులున్నవారే ప్రైవేటు పాఠశాలల్లో చదువుతారని... వారికి ఈ పథకం కింద డబ్బులు ఇవ్వడం అనవసరమని చెప్పారు. 

మరోవైపు కడప జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ (ఐసీడీఎస్) అధికారులపై ఆయన మండిపడ్డారు. ఈ శాఖ అవినీతిలో కూరుకుపోయిందని అన్నారు. సూపర్ వైజర్ల బదిలీల్లో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుంటోందని... ఎవరు డబ్బులిస్తే వారిని కావాల్సిన చోటుకు బదిలీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కడా సరైన పర్యవేక్షణ కూడా లేదని అన్నారు.
Raghurami Reddy
YSRCP
Amma Odi

More Telugu News