Samsung: రష్యాకు ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సరఫరా నిలిపివేసిన శాంసంగ్

Samsung decides to stop exports of electronic goods to Russia

  • ఉక్రెయిన్ పై దురాక్రమణకు తెగబడిన రష్యా
  • ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత
  • రష్యాపై అత్యంత కఠిన ఆంక్షలు
  • నిరసన తెలియజేసిన శాంసంగ్
  • ఉక్రెయిన్ కు రూ.45 కోట్ల ఆర్థికసాయం

పొరుగుదేశం ఉక్రెయిన్ పై దురాక్రమణకు దిగిన రష్యాకు ప్రపంచవ్యాప్తంగా ఎదురుగాలి వీస్తోంది. అనేక దేశాలు రష్యాపై అత్యంత కఠినమైన ఆంక్షలు విధించగా, టెక్ సంస్థలు, సోషల్ మీడియా సైట్లు, ఎలక్ట్రానిక్ సంస్థలు సైతం రష్యాకు తమ సేవలు నిరాకరిస్తున్నాయి. తాజాగా దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కూడా అదే బాటలో నడిచింది. 

రష్యాకు స్మార్ట్ ఫోన్లు, చిప్ లు, తదితర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సరఫరా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. ఉక్రెయిన్ లో రష్యా సైనిక బలగాల దాడులను నిరసిస్తూ ఈ నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ ప్రస్తుత పరిస్థితిని గమనిస్తున్నామని, రష్యా దాడులతో ప్రభావితమవుతున్న ప్రతి ఒక్కరి పట్ల తాము ఆందోళన చెందుతున్నామని శాంసంగ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ విపత్కర సమయంలో తమ సిబ్బంది, వారి కుటుంబాల క్షేమం తమ ప్రథమ కర్తవ్యం అని స్పష్టం చేసింది. 

ఈ క్రమంలో ఉక్రెయిన్ పై శాంసంగ్ సానుభూతి ప్రదర్శించింది. ఉక్రెయిన్ కు రూ.45 కోట్ల ఆర్థికసాయం అందించనున్నట్టు తన ప్రకటనలో తెలిపింది. తన సాయంలో రూ.7 కోట్ల విలువైన గృహోపకరణాలు కూడా ఉంటాయని శాంసంగ్ పేర్కొంది.

  • Loading...

More Telugu News