Revanth Reddy: చత్తీస్ గఢ్ సర్కారుతో మాట్లాడి మిమ్మల్ని తీసుకెళతా... సిద్ధమేనా?: కేటీఆర్ సవాల్ పై రేవంత్ రెడ్డి స్పందన

Revanth Reddy said he takes KTR challenge

  • తెలంగాణలో ఉన్న పథకాలు మరెక్కడా లేవన్న కేటీఆర్
  • ఎక్కడైనా చూపిస్తే రాజీనామా చేస్తానని వెల్లడి
  • సవాల్ ను స్వీకరిస్తున్నానన్న రేవంత్ రెడ్డి
  • చత్తీస్ గఢ్ లో ఇంతకంటే మెరుగైనవి ఉన్నాయని వెల్లడి

తెలంగాణ మంత్రి కేటీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. కేటీఆర్ విసిరిన సవాల్ ను స్వీకరిస్తున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలు మరే రాష్ట్రంలో చూపించినా పదవికి రాజీనామా చేస్తానని కేటీఆర్ ప్రకటించారు. 

దీనిపై రేవంత్ రెడ్డి స్పందించారు. ఓసారి చత్తీస్ గఢ్ లో ఎలాంటి పథకాలు అమలు చేస్తున్నారో కేటీఆర్ చూడాలని అన్నారు. తెలంగాణలో కంటే మెరుగైన సంక్షేమ పథకాలు చత్తీస్ గఢ్ లో ఉన్నాయని తెలిపారు. వరికి రూ.2,500 మద్దతు ధర ఇస్తున్నారని రేవంత్ వెల్లడించారు. కావాలంటే చత్తీస్ గఢ్ సర్కారుతో మాట్లాడి కేటీఆర్ ను అక్కడికి తీసుకెళతానని వ్యాఖ్యానించారు. వరి వేస్తే ఉరే అని టీఆర్ఎస్ సర్కారు అంటోందని, దీనిపై కేటీఆర్ చర్చకు వస్తారా? అని ప్రశ్నించారు. 

కేటీఆర్ సవాలుకు తాను స్పందించానని, మరి తన సవాలుకు కేటీఆర్ స్పందిస్తారా? అని అన్నారు. అందుకోసం కేటీఆర్ కు నెల రోజుల సమయం ఇస్తున్నానని రేవంత్ రెడ్డి వెల్లడించారు.

  • Loading...

More Telugu News