Telangana: తెలంగాణ బడ్జెట్ 2,56,958 కోట్లు.. బడ్జెట్ హైలైట్స్ - 1
- దళితబంధుకు రూ. 17,700 కోట్లు
- పోలీస్ శాఖకు రూ. 9,315 కోట్లు
- ఎస్టీ సంక్షేమం కోసం రూ. 12,565 కోట్లు
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ప్రజల ఆకాంక్షల మేరకు బడ్జెట్ ను రూపొందించామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. తెలంగాణను అన్ని విధాలుగా ముందుకు తీసుకుపోయేలా బడ్జెట్ ను తయారు చేశామని చెప్పారు.
బడ్జెట్ ప్రసంగంలోని హైలైట్స్:
- రాష్ట్ర బడ్జెట్ - రూ. 2,56,958 కోట్లు
- రెవెన్యూ వ్యయం - రూ. 1,89,274.82 కోట్లు
- క్యాపిటల్ వ్యయం - రూ. 29,728.44 కోట్లు
- దళితబంధుకు - రూ. 17,700 కోట్లు
- దళితబంధు ద్వారా 11,800 కుటుంబాలకు లబ్ధి. అతి పెద్ద నగదు బదిలీ పథకంగా దళితబంధు రికార్డు సృష్టించింది.
- పోలీస్ శాఖకు రూ. 9,315 కోట్లు
- రూ. 75 వేల లోపు పంట రుణాల మాఫీ
- రూ. 50 వేల లోపు రైతు రుణాలు ఈ నెల చివరిలోపు మాఫీ
- ఎస్టీ సంక్షేమం కోసం రూ. 12,565 కోట్లు
- బీసీ సంక్షేమం కోసం రూ. 5,698 కోట్లు
- బ్రాహ్మణ సంక్షేమం కోసం రూ. 177 కోట్లు
- కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కోసం రూ. 2,750 కోట్లు
- ఆసరా పింఛన్ కోసం రూ. 11,728 కోట్లు
- డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలకు రూ. 12,000 కోట్లు
- మన ఊరు - మన బడి కార్యక్రమానికి రూ. 7,289 కోట్లు
- హరితహారం పథకానికి రూ. 932 కోట్లు
- రోడ్లు, భవనాల శాఖకు రూ. 1,542 కోట్లు
- పామాయిల్ సాగుకు రూ. 1,000 కోట్లు
- తెలంగాణలో మరో 8 మెడికల్ కాలేజీలు. కొత్త మెడికల్ కాలేజీలకు రూ. 1,000 కోట్లు. రాబోయే రెండేళ్లలో అన్ని జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం.