Ravichandran Ashwin: రవీంద్ర జడేజా పెద్ద మనసు..  బయటపెట్టిన రవిచంద్రన్ అశ్విన్

Ravichandran Ashwin Reveals How Magnanimous Ravindra Jadeja Sacrificed Overs For Jayant Yadav
  • జయంత్ యాదవ్ తో కొన్ని ఓవర్లు వేయించాలన్నది ఆలోచన
  • ఎవరు త్యాగం చేయాలన్న ప్రశ్న ఎదురైంది
  • అప్పుడు జడ్డూ ముందుకొచ్చాడు
  • మ్యాచ్ సందర్భంగా జరిగింది వివరించిన అశ్విన్
భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఉదారతను మరో ఆల్ రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ మెచ్చుకోవడమే కాకుండా.. దాన్ని బయట పెట్టాడు. శ్రీలంకతో మొదటి టెస్ట్ మ్యాచ్ లో భాగంగా జడేజా మొదటి ఇన్నింగ్స్ లో 5 వికెట్లు తీయగా, రెండో ఇన్నింగ్స్ లో 4 వికెట్లు తీసి శ్రీలంక ఓటమికి కీలకంగా వ్యవహరించాడు. రవిచంద్రన్ అశ్విన్ కూడా ఆరు వికెట్లు తీసి రాణించాడు. అయితే, జట్టులోని మరో స్పిన్నర్ జయంత్ యాదవ్ కోసం తాము కొన్ని ఓవర్లు త్యాగం చేసినట్టు రవిచంద్రన్ అశ్విన్ చెప్పాడు. 

కొన్ని ఓవర్లను జయంత్ యాదవ్ తో వేయిద్దామన్నది కెప్టెన్ రోహిత్ శర్మ ఆలోచన. ‘‘జయంత్ ఎక్కువ బౌలింగ్ చేయలేదని నేను, జడేజా అర్థం చేసుకున్నాం. కొన్ని సందర్భాల్లో ఎక్కువగా బౌలింగ్ చేసే అవకాశం రాకపోవడం కష్టంగానే ఉంటుంది. దాంతో రోహిత్ కొన్ని ఓవర్ల పాటు అయినా జయంత్ తో బౌలింగ్ చేయిద్దామని అనుకున్నాడు. అప్పుడు ఎవరు త్యాగం చేయాలన్న ప్రశ్న ఎదురైంది. దాంతో జడ్డూ ముందుకు వచ్చి జయంత్ కోసం ఓవర్లను త్యాగం చేశాడు. ఆ తర్వాత నేను కూడా అదే పనిచేశాను. జడ్డూ నిజంగా ఉదారమైన మనసుతో ముందుగా తానే బాల్ ఇచ్చాడు’’ అని అశ్విన్ జరిగిన విషయాన్ని వివరించాడు.
Ravichandran Ashwin
Ravindra Jadeja
Sacrificed
Jayant Yadav
test match

More Telugu News