Telangana: రాష్ట్ర అప్పులు రూ. 3.30 లక్షల కోట్లు.. తెలంగాణ బడ్జెట్ హైలైట్స్ - 2
- పన్ను ఆదాయం రూ. 1,08,212 కోట్లు
- కేంద్ర పన్నుల్లో వాటా రూ. 18,394 కోట్లు
- పన్నేతర ఆదాయం రూ. 25,421 కోట్లు
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ ను తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. ప్రజల ఆకాంక్షల మేరకు బడ్జెట్ ను రూపొందించామని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఇది బడుగుల జీవితాలను మార్చే బడ్జెట్ అని చెప్పారు. ముమ్మాటికీ కేసీఆర్ మార్క్ బడ్జెట్ అని తెలిపారు.
బడ్జెట్ ప్రసంగంలోని మరికొన్ని హైలైట్స్:
- 2022-23 నాటికి రాష్ట్ర అప్పులు రూ. 3,29,998 కోట్లు
- పన్ను ఆదాయం రూ. 1,08,212 కోట్లు
- కేంద్ర పన్నుల్లో వాటా రూ. 18,394 కోట్లు
- పన్నేతర ఆదాయం రూ. 25,421 కోట్లు
- గ్రాంట్లు - రూ. 41,001 కోట్లు
- అమ్మకం పన్ను అంచనా రూ. 33 వేల కోట్లు
- ఎక్సైజ్ ద్వారా ఆదాయం రూ. 17,500 కోట్లు
- స్టాంపులు, రిజిస్ట్రేషన్ ద్వారా ఆదాయం రూ. 15,600 కోట్లు
- ముఖ్యమంత్రి పరిధిలో నిర్వాసితులు, ప్రమాద బాధితులకు ఇళ్ల కేటాయింపు
- యాదాద్రి తరహాలో పుణ్యక్షేత్రాల అభివృద్ధి
- పల్లె ప్రగతి ప్రణాళికకు రూ. 330 కోట్లు
- అటవీ విశ్వవిద్యాలయానికి రూ. 100 కోట్లు
- సొంత స్థలంలో రెండు పడకల ఇళ్ల నిర్మాణానికి రూ. 3 లక్షల చొప్పున ఆర్థిక సాయం. 4 లక్షల మందికి సాయం. ప్రతి నియోజకవర్గంలో 3 వేల ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం.
- గిరిజన గ్రామ పంచాయతీల భవనాల నిర్మాణాలకు రూ. 600 కోట్లు
- హెచ్ఎండీఏ పరిధిలో మరో 94 బస్తీ దవాఖానాలు
- కిడ్నీ రోగులకు 42 ఉచిత డయాలసిస్ కేంద్రాలు
- వరంగల్ లో హెల్త్ సిటీ
- ఆరోగ్యశ్రీ పరిమితి రూ. 5 లక్షలకు పెంపు
- అవయవ మార్పిడి చికిత్సలకు ఆరోగ్యశ్రీ ద్వారా రూ. 10 లక్షలు
- ఆక్సిజన్ ఉత్పత్తిని రోజుకు 135 నుంచి 550 టన్నులకు పెంపు
- రాష్ట్రంలో 84 లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు అందజేత
- రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ సామర్థ్యం 17,305 మెగావాట్లు