Chitra Ramakrishna: విచారణకు సహకరించని చిత్రా రామకృష్ణ... ఆనంద్ ను గుర్తుపట్టేందుకు నిరాకరణ

CBI told court Chitra Ramakrishna denies to identify Anand Subramanian
  • ఎన్ఎస్ఈ మాజీ సీఈవో చిత్రా రామకృష్ణ అరెస్ట్
  • ఆర్థిక అవకతవకలపై అదుపులోకి తీసుకున్న సీబీఐ
  • నేడు కోర్టులో హాజరుపర్చిన అధికారులు
  • 7 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి
నేషనల్ స్టాక్ ఎక్చేంజి మాజీ సీఈవో చిత్రా రామకృష్ణను ఆర్థిక అవకతవకల నేరారోపణలపై సీబీఐ అధికారులు అరెస్ట్ చేయడం తెలిసిందే. అయితే, చిత్రా రామకృష్ణ విచారణ సందర్భంగా తమకు సహకరించడంలేదని సీబీఐ అధికారులు నేడు స్పెషల్ కోర్టుకు తెలియజేశారు. 

విచారణలో భాగంగా ఎన్ఎస్ఈ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ ఆనంద్ సుబ్రమణియన్ ను ఆమెకు ఎదురుగా తీసుకువస్తే, అతడెవరో తనకు తెలియనట్టే వ్యవహరించిందని సీబీఐ అధికారులు కోర్టుకు నివేదించారు. ఆనంద్ సుబ్రమణియన్ ను గుర్తుపట్టేందుకు ఆమె నిరాకరించారని వెల్లడించారు. వారిద్దరి మధ్య 2,500 వరకు ఈమెయిళ్ల ద్వారా సమాచార మార్పిడి జరిగిందని, విచారణకు ఆమె సహకరించడంలేదని ఫిర్యాదు చేశారు. 

చిత్రా రామకృష్ణను నిన్న అరెస్ట్ చేసిన సీబీఐ అధికారులు ఇవాళ ఢిల్లీలో ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. సీబీఐ అధికారులు 14 రోజుల కస్టడీ కోరగా, కోర్టు 7 రోజుల కస్టడీకి అనుమతి నిచ్చింది. కాగా, చిత్రా రామకృష్ణ పేర్కొన్న అదృశ్యశక్తి, 'హిమాలయ యోగి' ఆనంద్ సుబ్రమణియనే అని సీబీఐ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అందుకే విచారణలో చిత్ర ఎదుటకు ఆనంద్ ను తీసుకువచ్చినట్టు తెలుస్తోంది.
Chitra Ramakrishna
CBI
Anand Subramanian
Court
NSE

More Telugu News