Corona Virus: దేశంలో నాలుగు వేల దిగువకు కరోనా కేసులు
- దేశంలో కొత్తగా 3,993 కరోనా కేసులు
- నిన్న కరోనా వల్ల 108 మంది మృతి
- రోజువారీ పాజిటివిటీ రేటు 0.46 శాతం
దేశంలో కొత్తగా 3,993 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న కరోనా వల్ల 108 మంది ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది. నిన్న కరోనా నుంచి 8,055 మంది కోలుకున్నట్లు వివరించింది. ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య మొత్తం 4,24,06,150గా ఉందని తెలిపింది.
ఇక రోజువారీ పాజిటివిటీ రేటు 0.46 శాతంగా ఉంది. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 49,948 మంది చికిత్స తీసుకుంటున్నారు. ఇప్పటివరకు మొత్తం 179.13 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్లు వేశారు.