Axar Patel: రెండో టెస్టు కోసం టీమిండియాలోకి అక్షర్ పటేల్... లోయరార్డర్ మరింత బలోపేతం

Axar Patel back into Team India squad
  • గాయం నుంచి కోలుకున్న అక్షర్ పటేల్
  • కుల్దీప్ యాదవ్ ను విడుదల చేసిన జట్టు యాజమాన్యం
  • ఈ నెల 12 నుంచి శ్రీలంకతో రెండో టెస్టు
శ్రీలంకతో రెండో టెస్టు కోసం టీమిండియాలో ఒక మార్పు చేశారు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ ను జట్టు నుంచి విడుదల చేశారు. గాయం నుంచి కోలుకుని ఫిట్ నెస్ నిరూపించుకున్న ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ను సెలెక్టర్లు జట్టుకు ఎంపిక చేశారు. ఈ నెల 12 నుంచి శ్రీలంకతో బెంగళూరు వేదికగా టీమిండియా రెండో టెస్టు ఆడనుంది. ఈ మ్యాచ్ లో అక్షర్ పటేల్ ఆడడం దాదాపు ఖాయమే. మొహాలీలో జరిగిన తొలి టెస్టులో రెండు ఇన్నింగ్స్ ల్లోనూ ఒక్క వికెట్టూ తీయలేకపోయిన స్లో ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్ బెంచ్ కు పరిమితం కాకతప్పదు.
Axar Patel
Team India
Second Test
Sri Lanka
Bengaluru

More Telugu News