Ukraine: రష్యాపై అమెరికా మరో ఆంక్ష?.. పుతిన్‌కు కష్టమేనా?
- రష్యా చమురు దిగుమతులపై నిషేధం?
- కాసేపట్లో అమెరికా అధ్యక్షుడి ప్రకటన
- అంతర్జాతీయ మీడియాలో వార్తల కలకలం
- ఇదే జరిగితే రష్యా ఆర్థిక వ్యవస్థ కుదేలే
ఉక్రెయిన్‌ను చెరబట్టడమే లక్ష్యంగా సాగుతున్న రష్యాకు మరో బిగ్ షాక్ తగలనుంది. యుద్ధ కాంక్షతో రగిలిపోతున్న రష్యాపై ఇప్పటికే కొన్ని ఆర్థికపరమైన ఆంక్షలను విధించిన అగ్ర రాజ్యం అమెరికా తాజాగా మరో కీలక ఆంక్షను విధించేందుకు సిద్ధమైంది. రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయాలని అమెరికా భావిస్తోంది. ఈ మేరకు మరికాసేపట్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా ఈ ప్రకటనను చేయనున్నట్లుగా అంతర్జాతీయ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.
అమెరికా తన చమురు ఎగుమతులను స్వీకరించకపోతే రష్యా ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలుగుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతా ఊహిస్తున్నట్లుగా అమెరికా ఇదే దిశగా నిర్ణయం తీసుకుంటే..అది రష్యా ఆర్థిక పతనానికి దారి తీస్తుందన్న విశ్లేషణలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి ఈ దిశగా బైడెన్ కీలక నిర్ణయం తీసుకుంటారో, లేదోనన్న దానిపైనా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.