Rajiv Gandhi: రాజీవ్ హత్యకేసు దోషికి సుప్రీంకోర్టు బెయిల్‌!

supreme court hrants bail to rajiv gandhi killer perarivalan

  • 1991లో రాజీవ్ గాంధీ దారుణ హ‌త్య‌
  • దోషులుగా తేలిన ఏడుగురిలో పెరారివ‌ల‌న్‌
  • 2016 బెయిల్ పిటిష‌న్ దాఖ‌లు
  • 32 ఏళ్ల పాటు జైలు జీవితాన్ని గ‌డిపాడ‌న్న సుప్రీం 

మాజీ ప్ర‌ధాన మంత్రి రాజీవ్ గాంధీ హత్య కేసులో శిక్ష అనుభవిస్తున్న దోషి పెరారివ‌ల‌న్‌కు స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. 1991లో జ‌రిగిన రాజీవ్ గాంధీ హ‌త్య కేసులో పెరారివల‌న్‌ స‌హా ఏడుగురు దోషులుగా తేల‌గా.. వారు జీవిత ఖైదు అనుభవిస్తున్న సంగ‌తి తెలిసిందే.

వీరంతా ప్ర‌స్తుతం జైల్లోనే ఉంటున్నారు. దాదాపుగా 32 ఏళ్ల పాటు పెరారి స‌హా దోషులంతా జైలు జీవితాన్ని గ‌డుపుతున్నారు. అయితే త‌న‌కు బెయిల్ మంజూరు చేయాలంటూ పెరారివ‌ల‌న్ 2016లో సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిష‌న్‌పై ఇప్ప‌టికే ప‌లు విడ‌త‌లుగా విచార‌ణ జ‌ర‌గ్గా.. బుధ‌వారం జ‌స్టిస్ లావు నాగేశ్వ‌ర‌రావు, జ‌స్టిస్  బీఆర్ గ‌వాయ్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం మ‌రోమారు విచార‌ణ చేప‌ట్టింది.

ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం.. పెరారికి బెయిల్ ఇస్తూ సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది. ఇప్ప‌టికే జైల్లో 32 ఏళ్ల పాటు గ‌డిపినందున పెరారి బెయిల్‌కు అర్హుడేన‌ని కోర్టు పేర్కొంది. అయితే పెరారికి బెయిల్ ఇవ్వ‌రాదంటూ కేంద్ర ప్ర‌భుత్వం వివిధ కార‌ణాల‌ను కోర్టు ముందుంచింది. 

ఇప్ప‌టికే జైలు శిక్ష అనుభ‌విస్తూ కూడా పెరారి మూడు పర్యాయాలు పెరోల్‌పై బ‌య‌ట‌కు వెళ్లాడ‌ని, 32 ఏళ్ల జైలు జీవితం త‌ర్వాత అత‌డు బ‌య‌ట‌కు వెళితే వ‌చ్చే ముప్పేమిటంటూ ధ‌ర్మాస‌నం కేంద్ర ప్ర‌భుత్వాన్ని ప్రశ్నించింది. పెరారికి బెయిల్ ఇవ్వరాద‌న్న కేంద్రం వాద‌న‌ల‌ను తోసిపుచ్చిన కోర్టు.. అత‌డికి బెయిల్ మంజూరు చేసింది.

  • Loading...

More Telugu News