Parliament: క‌రోనా ఎఫెక్ట్... ఉద‌యం రాజ్యసభ, సాయంత్రం లోక్ సభ సమావేశాలు

parliament budget sessions will starts from 14thof this month

  • వేర్వేరు స‌మ‌యాల్లో ఉభ‌య స‌భ‌ల స‌మావేశాలు
  • పార్ల‌మెంటు బ‌డ్జెట్ రెండో విడ‌త భేటీలో కీల‌క నిర్ణ‌యం
  • ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు రాజ్యసభ
  • సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 వరకు లోక్ సభ  

ప్ర‌పంచ దేశాల‌ను గడ‌గ‌డ‌లాడించిన క‌రోనా వైర‌స్ ఉద్ధృతి ఇప్పుడిప్పుడే త‌గ్గుతోంది. తొలి, రెండో వేవ్‌ల‌లో బీభ‌త్సం సృష్టించిన ఈ వైర‌స్ మూడో వేవ్‌లో అంత‌గా ప్ర‌భావం చూప‌లేక‌పోయింది. తాజాగా నాలుగో వేవ్ అంటూ వార్త‌లు వినిపిస్తున్నా.. దాని గురించి అంత‌గా ప‌ట్టించుకోవాల్సిన అవ‌స‌ర‌మేమీ లేద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

ఈ క్ర‌మంలో మునుపెన్న‌డూ లేని విధంగా పార్ల‌మెంటు బ‌డ్జెట్ రెండో విడ‌త స‌మావేశాల్లో ఓ కొత్త సంప్ర‌దాయం అమ‌ల్లోకి వ‌స్తోంది. ఉద‌యం ఎగువ స‌భ జ‌రిగితే.. సాయంత్రం దిగువ స‌భ స‌మావేశ‌మ‌య్యేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేర‌కు పార్ల‌మెంటు సెక్ర‌టేరియ‌ట్ బుధవారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. 

పార్లమెంట్‌ తొలి విడత బడ్జెట్‌ సెషన్‌ జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు కొనసాగగా.. తొలి రోజున రాష్ట్రపతి ప్రసంగం.. ఆ తర్వాత ఆర్థిక సర్వేను మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంట్‌కు సమర్పించడం.. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. 

ఇక, ఈ నెల 14వ తేదీ నుంచి బడ్జెట్‌ రెండో విడత సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి.. అయితే, పార్లమెంట్‌ ఉభయసభలను వేర్వేరు సమయాల్లో నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చారు. పార్ల‌మెంటులో పెద్ద‌ల స‌భ‌గానే కాకుండా ఎగువ స‌భ‌గా భావిస్తున్న‌ రాజ్యసభ సమావేశాలు ఉదయం జరగనుండగా.. దిగువ స‌భ‌గా ప‌రిగ‌ణిస్తున్న లోక్‌సభ సాయంత్రం స‌మావేశం కానుంది. రాజ్యసభ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరగనుండగా.. లోక్‌సభ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరగనుంది.

  • Loading...

More Telugu News