Corona Virus: ఇక 12-17 ఏళ్ల పిల్ల‌ల‌కూ వ్యాక్సిన్‌.. కోవావాక్స్‌కు డీసీజీఐ అనుమ‌తి

dcgi permits covovax to 12 to17 years children

  • పిల్ల‌ల‌కు అత్య‌వ‌స‌ర వినియోగానికి గ్రీన్ సిగ్న‌ల్‌
  • సీరం ఇన్‌స్టిట్యూట్‌కు డీసీజీఐ లేఖ‌
  • 12-17 ఏళ్ల వ‌య‌సు పిల్ల‌ల‌కూ త్వ‌ర‌లోనే వ్యాక్సినేష‌న్

క‌రోనా వైర‌స్ నుంచి ర‌క్ష‌ణ కోసం అందుబాటులోకి వ‌చ్చిన వ్యాక్సిన్లు పెద్ద‌ల‌లో పాటు యుక్త వ‌య‌సు పిల్ల‌ల‌కు కూడా అందుబాటులోకి వ‌చ్చాయి. తాజాగా 12 నుంచి 17 ఏళ్ల మ‌ధ్య వ‌య‌సు పిల్ల‌లకు కూడా వ్యాక్సినేష‌న్‌కు రంగం సిద్ధ‌మైంది. 12-17 ఏళ్ల వ‌య‌సు పిల్ల‌ల‌కు కోవావాక్స్‌ను వినియోగించేలా డీసీజీఐ బుధ‌వారం నాడు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ మేర‌కు ఈ వ్యాక్సిన్ ఉత్ప‌త్తిదారు అయిన సీరం ఇన్ స్టిట్యూట్‌కు డీసీజీఐ అనుమ‌తి ఇచ్చింది. 

ఇదిలా ఉంటే.. 15 ఏళ్ల పైబ‌డ్డ పిల్ల‌ల‌కు వ్యాక్సినేష‌న్‌కు ఇప్ప‌టికే అనుమ‌తి ఇచ్చేసిన కేంద్ర ప్ర‌భుత్వం.. 15 ఏళ్ల కంటే త‌క్కువ వ‌య‌సు క‌లిగిన పిల్ల‌ల‌కు వ్యాక్సినేష‌న్‌కు మాత్రం ఎలాంటి ప్ర‌ణాళికను ప్ర‌క‌టించ‌లేదు. ఈ గ్రూప్ వ‌య‌సు పిల్ల‌ల‌కు వ్యాక్సిన్ అందుబాటులోకి రాని నేప‌థ్యంలోనే కేంద్రం ఇంకా ఈ దిశ‌గా నిర్ణ‌యం తీసుకోలేద‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. అయితే ఇప్పుడు కోవావాక్స్ ను 12-17 ఏళ్ల పిల్ల‌ల‌కు వినియోగించేందుకు డీసీజీఐ అనుమ‌తి ఇవ్వ‌డంతో ఈ గ్రూప్ వ‌య‌సు పిల్ల‌ల వ్యాక్సినేష‌న్‌పై త్వ‌ర‌లోనే కేంద్రం ఈ దిశ‌గా ప్ర‌క‌ట‌న చేయ‌నుంద‌న్న వాద‌న‌లు వినిపిస్తున్నాయి.

  • Loading...

More Telugu News