Assembly Elections: ప్రారంభమైన ఓట్ల లెక్కింపు.. టీవీల ముందు ఆసక్తిగా జనం
- ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
- ఎగ్జిట్ పోల్స్ అంచనాలు నిజమవుతాయా?
- ‘సెమీ ఫైనల్’ ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి
ఉత్తరప్రదేశ్, పంజాబ్ సహా ఐదు రాష్ట్రాలకు ఇటీవల జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇవి దేశ రాజకీయాలపై ప్రభావం చూపిస్తాయన్న కారణంతో ఈ ఎన్నికలను ‘సెమీఫైనల్’గా భావిస్తారు. దీంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
ఇటీవల విడుదలైన ఎగ్జిట్ పోల్స్ అంచనాలను అందుకుంటాయా? లేదా? అన్నది అందరిలోనూ ఉత్కంఠ రేపుతోంది. దీంతో లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచే జనం టీవీలకు అతుక్కుపోయారు. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇటీవల వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఉత్తరప్రదేశ్, మణిపూర్ బీజేపీ సొంతమవుతాయని అంచనా వేయగా, ఉత్తరాఖండ్, గోవాలలో బీజేపీ-కాంగ్రెస్ హోరాహోరీగా తలపడతాయని అంచనా వేశాయి. పంజాబ్‌లో మాత్రం కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ తిరుగులేని ఆధిక్యంతో అధికారంలోకి వస్తుందని పేర్కొన్నాయి. ఈ అంచనాలు ఏమాత్రం నిజమవుతాయో తెలుసుకోవాలంటే మధ్యాహ్నం వరకు ఎదురుచూడక తప్పదు. అయితే, ఓటింగ్ సరళి మాత్రం మరో గంట, రెండు గంటల్లో తెలిసిపోనుంది.