Andhra Pradesh: రూ. 2,56,256 కోట్లతో ఏపీ బడ్జెట్.. బీసీ సబ్ ప్లాన్ కు రూ. 29 వేల కోట్లు.. బడ్జెట్ హైలైట్స్ - 1
- రెవెన్యూ లోటు - రూ. 17,036 కోట్లు
- బీసీ సబ్ ప్లాన్ కు రూ. 29,143 కోట్లు
- వైఎస్సార్ పెన్షన్ కానుక పథకానికి రూ. 18 వేల కోట్లు
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర బడ్జెట్ ను ఏపీ ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మహిళా సంక్షేమం, వ్యవసాయం, విద్య, వైద్య రంగాలకు బడ్జెట్ లో అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చామని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా ఆయన చెప్పారు. ముఖ్యమంత్రి జగన్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా బడ్జెట్ ను రూపొందించామని తెలిపారు.
ఏపీ బడ్జెట్ హైలైట్స్:
- మొత్తం బడ్జెట్ - రూ. 2,56,256 కోట్లు
- రెవెన్యూ వ్యయం - రూ. 2,08,261 కోట్లు
- మూలధన వ్యయం - రూ. 47,996 కోట్లు
- రెవెన్యూ లోటు - రూ. 17,036 కోట్లు
- ద్రవ్యలోటు - రూ. 48,724 కోట్లు
- వైఎస్సార్ రైతు భరోసాకు రూ. 3,900 కోట్లు
- వైఎస్సార్ పెన్షన్ కానుక పథకానికి రూ. 18 వేల కోట్లు
- మహిళా శిశు సంక్షేమానికి రూ. 4,382 కోట్లు
- రోడ్లు, భవనాల శాఖకు రూ. 8,581 కోట్లు
- వ్యవసాయ శాఖకు రూ. 11,387 కోట్లు
- పశు సంవర్ధక శాఖకు రూ. 1,568 కోట్లు
- ఎస్సీ సబ్ ప్లాన్ కు రూ. 18,518 కోట్లు
- ఎస్టీ సబ్ ప్లాన్ కు రూ. 6,145 కోట్లు
- బీసీ సబ్ ప్లాన్ కు రూ. 29,143 కోట్లు
- బీసీ సంక్షేమానికి రూ. 20,962 కోట్లు
- మైనార్టీ యాక్షన్ ప్లాన్ కు రూ. 3,532 కోట్లు
- ఈబీసీల సంక్షేమానికి రూ 6,639 కోట్లు
- సోషల్ వెల్ఫేర్ కు 12,728 కోట్లు
- ఉన్నత విద్యకు రూ. 2,014 కోట్లు
- సెకండరీ ఎడ్యుకేషన్ కు రూ. 22,706 కోట్లు
- ఈడబ్ల్యూఎస్ కు రూ. 10,201 కోట్లు
- విద్యుత్ శాఖకు రూ. 10,281 కోట్లు
- క్రీడల శాఖకు రూ. 290 కోట్లు
- పర్యావరణ, అటవీ శాఖకు రూ 685 కోట్లు
- పరిశ్రమల శాఖకు రూ. 2,755 కోట్లు
- వైద్య శాఖకు 15,384 కోట్లు
- హోంశాఖకు 7,586 కోట్లు