Team India: శ్రీలంకతో డే నైట్ టెస్టులో టాస్ మనదే!

Team India won the toss in second test against Sri Lanka
  • టీమిండియా, శ్రీలంక మధ్య రెండు టెస్టుల సిరీస్
  • తొలి టెస్టులో నెగ్గిన టీమిండియా
  • నేటి నుంచి బెంగళూరులో రెండో టెస్టు
  • డే నైట్ విధానంలో పింక్ బాల్ తో టెస్టు
  • బ్యాటింగ్ ఎంచుకున్న భారత్
శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్ లో భాగంగా చివరి టెస్టు నేడు బెంగళూరులో ప్రారంభం కానుంది. ఈ డే నైట్ టెస్టులో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్ లో ఇప్పటికే తొలి టెస్టు గెలిచిన టీమిండియా... రెండో టెస్టులోనూ నెగ్గి క్లీన్ స్వీప్ చేయాలని తహతహలాడుతోంది. 

మరోవైపు శ్రీలంక జట్టు టీ20 సిరీస్ లో కనబర్చిన పేలవ ప్రదర్శనను టెస్టుల్లోనూ కొనసాగిస్తోంది. సొంతగడ్డపై, కొత్త కెప్టెన్ సారథ్యంలో అద్భుతంగా ఆడుతున్న భారత్ కు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోతోంది. 

కాగా, ఈ మ్యాచ్ కు జయంత్ యాదవ్ స్థానంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చాడు. అక్షర్ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడని కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. మరోసారి శ్రీలంకపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడతామని స్పష్టం చేశాడు. 

ఇక శ్రీలంక జట్టులో గాయాలతో బాధపడుతున్న పథుమ్ నిస్సాంక, లహిరు కుమారలకు విశ్రాంతినిచ్చారు. వారి స్థానంలో కుశాల్ మెండిస్, ప్రవీణ్ జయవిక్రమ జట్టులోకి వచ్చారు.
Team India
Toss
Sri Lanka
2nd Test
Day Night
Pink Ball
Bengaluru

More Telugu News