KTR: కిషన్ రెడ్డి కేంద్రమంత్రిగా ఉండటం మన దురదృష్టం: మంత్రి కేటీఆర్
- హైదరాబాదుకు కేంద్రం ఇంతవరకు వరద సాయం చేయలేదు
- హైదరాబాదుకు చెందిన కిషన్ రెడ్డికి మనసు రావడం లేదన్న కేటీఆర్
- కంటోన్మెంట్ అధికారులు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఊరుకోబోమని హెచ్చరిక
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు గుప్పించారు. హైదరాబాదుకు కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు వరద సహాయం చేయలేదని అన్నారు. హైదరాబాదుకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మనసు రావడం లేదని.. ఆయన కేంద్ర మంత్రిగా ఉండటం మన దురదృష్టమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు దారుణంగా ఉందని అన్నారు.
ఇదే సమయంలో కంటోన్మెంట్ అధికారులపై ఆయన మండిపడ్డారు. కంటోన్మెంట్ అధికారులు ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తే తాము ఊరుకోబోమని హెచ్చరించారు. వాళ్లు రోడ్లు బంద్ చేస్తే తాము కరెంట్, నీళ్లు బంద్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. కంటోన్మెంట్ అధికారులతో మాట్లాడాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీని ఆదేశిస్తానని చెప్పారు. ఒకవేళ వాళ్లు మాట వినకపోతే కఠిన చర్యలకు కూడా వెనకాడొద్దని రాష్ట్ర ప్రభుత్వం తరపున అసెంబ్లీలో చెపుతున్నానని అన్నారు.