Team India: డే నైట్ టెస్టులో ముగిసిన తొలిరోజు ఆట... శ్రీలంక 86-6

First day play in Bengaluru test concluded
  • బెంగళూరులో భారత్ వర్సెస్ శ్రీలంక
  • తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 252 ఆలౌట్
  • 92 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్
  • లంకను బెంబేలెత్తించిన భారత బౌలర్లు
  • బుమ్రాకు 3 వికెట్లు, షమీకి 2 వికెట్లు
టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న డే నైట్ టెస్టులో తొలిరోజు ఆట ముగిసింది. ఆట ఆఖరుకు శ్రీలంక జట్టు తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 86 పరుగులు చేసింది. 

క్రీజులో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ నిరోషన్ డిక్వెల్లా (13 బ్యాటింగ్), లసిత్ ఎంబుల్దెనియ (0 బ్యాటింగ్) ఉన్నారు. అంతకుముందు, ఏంజెలో మాథ్యూస్ 43 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్ లో అవుటయ్యాడు. టీమిండియా బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు పడగొట్టగా, షమీ 2, అక్షర్ పటేల్ ఓ వికెట్ తీశారు. 

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 252 పరుగులకు ఆలౌట్ కావడం తెలిసిందే. శ్రేయాస్ అయ్యర్ 92 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.
Team India
Sri Lanka
Bengaluru
2nd Test

More Telugu News