Vishal: ఓటీటీలో దూసుకుపోతున్న 'సామాన్యుడు'

Vishal Samanyudu movie streaming in Zee5
  • విశాల్, డింపుల్ హయతి, రీనా రవి కాంబినేషన్లో తెరకెక్కిన 'సామాన్యుడు'
  • మార్చ్ 4 నుంచి జీ5లో స్ట్రీమింగ్
  • ప్రతి నెల సినిమాలు, వెబ్ సిరీస్ లను విడుదల చేస్తున్న జీ5
విశాల్ నటించిన తాజా చిత్రం 'సామాన్యుడు' ఓటీటీలో దూసుకుపోతోంది. తమిళంలో 'వీరమే వాగై సూదుం' పేరుతో ఈ చిత్రం తెరకెక్కింది. దీన్ని 'సామాన్యుడు' పేరుతో తెలుగులో విడుదల చేశారు. ఈ చిత్రంలో విశాల్ సరసన డింపుల్ హయతి, రీనా రవి నటించారు. ఈ చిత్రం ఓటీటీ సంస్థ జీ5లో మార్చ్ 4 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఓటీటీలో ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. తమిళంలో కంటే తెలుగు ప్రేక్షకులను ఈ చిత్రం ఎక్కువగా ఆకట్టుకుంటోంది. 

మరోవైపు జీ5 పలు భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్ లను ప్రతి నెల విడుదల చేస్తోంది. మొబైల్, డెస్క్ టాప్, ల్యాప్ టాప్ లపై కేవలం ఒక క్లిక్ చేస్తే చాలు ఫుల్ ఎంటర్టైన్ మెంట్ లభించేలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇటీవలే విడుదలైన 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ', 'లూజర్', 'లూజర్ 2', సుమంత్ నటించిన 'మళ్లీ మొదలైంది', అక్కినేని నాగార్జున, నాగ చైతన్యల 'బంగార్రాజు' విజయవంతంగా ప్రసారం అవుతున్నాయి. మార్చి 11 నుండి 'రౌడీ బాయ్స్' స్ట్రీమింగ్ ప్రారంభమైంది.
Vishal
Samanyudu Movie
OTT
ZEE5

More Telugu News