Not Female: నా భార్య స్త్రీ కాదు.. విడాకులు కావాలి.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన వ్యక్తి
- ఆమెకు పురుష జననేంద్రియం
- పిల్లలు పుట్టే అవకాశాల్లేవు
- విషయాన్ని దాచి పెట్టి మోసం చేశారు
- ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించిన గ్వాలియర్ వాసి
తన భార్య స్త్రీ కాకపోయినా, ఆ విషయం దాచి పెట్టి తనతో పెళ్లి చేశారంటూ ఓ బాధితుడు సుప్రీంకోర్టు తలుపు తట్టాడు. విడాకులు ఇప్పించాలని కోరాడు.
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ పట్టణానికి చెందిన ఓ వ్యక్తికి 2016లో పెళ్లయింది. లైంగిక జీవనానికి తొలుత కొంత కాలం నిరాకరించిన ఆమె, తర్వాత భర్త బలవంతం మీద ఎట్టకేలకు ఒప్పుకుంది. తీరా ఆమెకు తెరుచుకోని స్త్రీ జననేంద్రియంతోపాటు.. పురుష జననేంద్రియం సైతం ఉన్నట్టు అతడు గుర్తించాడు.
వైద్య పరీక్షల్లో ఇంపెర్ఫోరేట్ హైమెన్ అనే సమస్య పుట్టుకతో ఉన్నట్టు బయటపడింది. దీంతో తనను మోసం చేశారంటూ భార్య తల్లిదండ్రులను నిలదీశాడు. దీనిపై ఇరువర్గాలు పోలీసు కేసు పెట్టుకున్నాయి. శస్త్రచికిత్స ద్వారా సమస్యను సరిచేసుకోవచ్చని, అయినా పిల్లలు పుట్టే అవకాశాల్లేవని వైద్యులు తేల్చారు.
దీనిపై మధ్యప్రదేశ్ హైకోర్టు పిటిషన్ ను తోసిపుచ్చడంతో అతడు సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. దీంతో తన స్పందన తెలియజేయాలని కోరుతూ ఆ మహిళకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.