China: వందల కేసులకే చైనా ఎందుకు వణికిపోతోంది?  పూర్తి లాక్ డౌన్ చేసేయడం ఎందుకు? 

China does not have a new Covid variant Yet its on lockdown Why

  • ఏ మాత్రం ఉపేక్షణ వద్దు
  • చైనా అనుసరిస్తున్న విధానం ఇదే
  • ఒక్క కేసు వచ్చినా మూతేయడమే
  • ఆంక్షలతో వైరస్ విస్తరణను అడ్డుకోవడమే లక్ష్యం

కరోనా మహమ్మారికి పుట్టినిల్లు అయిన చైనా.. తాజాగా కేసులు పెరుగుతుండడంతో కొన్ని ప్రాంతాల్లో పూర్తి లాక్ డౌన్ విధిస్తోంది. ప్రజలను బయటకు రాకుండా కట్టుదిట్టమైన ఆంక్షలు విధిస్తోంది. ఒక్క కేసు వచ్చినా ఆ ప్రాంతాన్ని లాక్ డౌన్ చేసేయడం చైనా అనుసరిస్తున్న విధానం. దీంతో చైనా తీరు చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

తాజాగా 1.75 కోట్ల జనాభా ఉన్న ఒక పట్టణంలో పూర్తి స్థాయి లాక్ డౌన్ ను అక్కడి సర్కారు అమలు చేసింది. అన్ని రకాల సేవలను నిలిపివేసింది. చాంగ్ చన్ (90 లక్షల జనాభా), షునీ, షెన్ జెన్ తదితర పట్టణాల్లో ప్రస్తుతం లాక్ డౌన్ లు అమల్లో ఉన్నాయి. రాజధాని బీజింగ్ లోనూ ఆంక్షలు అమలవుతున్నాయి. 

2019 చివర్లో చైనాలోని సెంట్రల్ ప్రావిన్స్ వుహాన్ పట్టణంలో కరోనా వెలుగు చూసింది. ఆ తర్వాత ప్రపంచమంతా పాకి సుమారు 2 కోట్ల మందిని బలి తీసుకుని ఉంటుందని అంచనాలున్నాయి. కానీ కరోనా మొదలైన చైనాలో ఇప్పటి వరకు మహమ్మారితో మరణించిన వారు 4,636 మంది అని అక్కడి సర్కారు లెక్కలు చెబుతున్నాయి. 

సోమవారం చైనా వ్యాప్తంగా 1,436 కేసులు బయటపడ్డాయి. మన దేశంలో దీనికి మూడు రెట్లు అధికంగా కేసులు నమోదవుతున్నాయి. జనవరిలో అయితే లక్షన్నర వరకు మన దేశంలో ఒమిక్రాన్ కేసులు వచ్చాయి. అయినా లాక్ డౌన్ లు పెట్టింది లేదు. మరి చైనా ఎందుకు ఇలా చేస్తోంది? 

జీరో టోలరెన్స్ (ఏ మాత్రం ఉపేక్షించకూడదు) అనే విధానాన్ని చైనా అనుసరిస్తోంది. ఒక్క కేసు వచ్చినా మిగతా ప్రపంచంతో ఐసోలేట్ చేయడమే దీని విధానం. చైనా తొలి నుంచీ దీనినే ఆచరిస్తోంది. ఒక్క కేసు వచ్చినా పూర్తి లాక్ డౌన్, ఆంక్షలు అమలు చేసి, అందరికీ టెస్టింగ్ చేసి విస్తరణను అడ్డుకుంటోంది. ఈ చర్యల వల్లే వింటర్ ఒలింపిక్స్ సజావుగా నిర్వహించడం చైనాకు సాధ్యపడిందని విశ్లేషకుల అంచనా.

  • Loading...

More Telugu News