Raghunandan Rao: చీఫ్ సెక్రటరీ సోమేశ్ కుమార్ పై వేసిన పిటిషన్ ను ఎవరు తొక్కిపెడుతున్నారు?: రఘునందన్ రావు

Who is stopping petition on Somesh Kumar asks Raghunandan Rao
  • సోమేశ్ కుమార్ పై పిటిషన్ వేసి ఐదేళ్లవుతోంది
  • ఇంత వరకు హైకోర్టు బెంచ్ ముందుకు ఎందుకు రాలేదు?
  • నిబంధనల ప్రకారం సోమేశ్ కుమార్ ఏపీకి కేటాయించిన అధికారి
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ పై వేసిన రిట్ పిటిషన్ ఐదేళ్లు గడుస్తున్నా హైకోర్టు బెంచ్ ముందుకు ఎందుకు రావడం లేదని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. విచారణకు రాకుండా ఈ పిటిషన్ ను తొక్కిపెడుతున్నది ఎవరని ప్రశ్నించారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ముందుకు రాకుండా చేస్తున్నది ఎవరని అడిగారు. 

ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరపాలని కోరుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణకు లేఖ రాశానని చెప్పారు. నిబంధనల ప్రకారం సోమేశ్ కుమార్ ఏపీకి కేటాయించిన అధికారి అని తెలిపారు. సోమేశ్ కుమార్ తో పాటు మరో 12 మంది అధికారులు ఏపీకి కేటాయించినవారేనని... వారంతా నిబంధనలకు విరుద్ధంగా తెలంగాణలో కొనసాగుతున్నారని చెప్పారు.
Raghunandan Rao
BJP
Somesh Kumar
Chief Secretary
Telangana

More Telugu News