ICC Womens World Cup 2022: మహిళల ప్రపంచకప్.. టాస్ గెలిచి భారత్‌కు బ్యాటింగ్ అప్పగించిన ఇంగ్లండ్
- వరుస ఓటములతో ఇంగ్లండ్..
- మూడింటిలో రెండు గెలిచి జోరుమీదున్న భారత్
- గత ప్రపంచకప్ ఫైనల్‌లో జరిగిన పరాభవానికి ప్రతీకారం కోసం చూస్తున్న మిథాలీ సేన
- గెలిచి ఖాతా తెరవాలన్న పట్టుదలలో ఇంగ్లండ్
ఐసీసీ మహిళల ప్రపంచకప్‌లో భాగంగా భారత్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటి వరకు మూడు మ్యాచ్‌లు ఆడిన మిథాలీ సేన రెండింటిలో నెగ్గింది. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై నెగ్గిన భారత జట్టు తర్వాతి మ్యాచ్‌లో ఆతిథ్య కివీస్ చేతిలో ఓడింది. మూడో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను చిత్తు చేసింది. ఇప్పుడీ మ్యాచ్‌లోనూ అదే జోరు కొనసాగించాలని, గత ప్రపంచకప్ ఫైనల్‌లో జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది.
మరోవైపు, ఇంగ్లండ్ పరిస్థితి మాత్రం దారుణంగా ఉంది. ఇప్పటి వరకు ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. భారత్‌పై గెలుపు ద్వారా బోణీ చేయాలని భావిస్తోంది. కాగా, టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 18 పరుగులు వద్ద ఓపెనర్ యస్తికా భాటియా వికెట్‌ను కోల్పోయింది. 11 బంతుల్లో 8 పరుగులు చేసిన యస్తిక.. శృన్‌సోల్ బౌలింగులో బౌల్డయింది. ప్రస్తుతం 5 ఓవర్లు ముగిశాయి. భారత్ వికెట్ నష్టానికి 25 పరుగులు చేసింది. స్మృతి మంధాన, కెప్టెన్ మిథాలీ రాజ్ క్రీజులో ఉన్నారు.