Gold: పడిపోతున్న పసిడి ధరలు.. వారంలోనే రూ. 2 వేలకుపైగా పతనం

Gold and silver Rates decreasing

  • బంగారం నుంచి పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్న మదుపర్లు
  • దేశీయంగా, అంతర్జాతీయంగా తగ్గుముఖం పడుతున్న ధరలు
  • వారం రోజుల్లో బంగారంపై రూ. 2100 తగ్గుదల

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం నేపథ్యంలో తొలుత పరుగులు పెట్టిన బంగారం ధర ఇప్పుడు తగ్గుముఖం పడుతోంది. యుద్ధం మొదలైనప్పుడు బంగారంపై పెట్టుబడులు పెట్టిన మదుపర్లు ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నారు. ఫలితంగా పసిడి, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. 

రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతున్నప్పటికీ ఇరు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయి. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచనున్న నేపథ్యంలో మదుపర్లు బంగారం నుంచి పెట్టుబడులు ఉపసంహరిస్తున్నారు. ఫలితంగా అంతర్జాతీయంగానే కాకుండా దేశీయంగానూ పుత్తడి, వెండి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి.

ఈ నెల 8న అంతర్జాతీయ విపణిలో ఔన్సు బంగారం ధర గరిష్ఠంగా 2069 డాలర్లకు చేరింది. మంగళవారం మాత్రం ఇది 1915 డాలర్లకు క్షీణించింది. ఇక, భారత బులియన్ మార్కెట్లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 53 వేలుగా ఉండగా, వెండి ధర కిలో రూ. 69,600గా ఉంది. ఈ నెల 8న వీటి ధరలు వరుసగా  రూ.55,100, రూ. 72,900 ఉన్నాయి. అంటే వారం రోజుల వ్యవధిలో బంగారంపై రూ. 2,100, వెండిపై రూ. 3,300 తగ్గడం గమనార్హం.

  • Loading...

More Telugu News