Prabhas: ప్రభాస్ జోడీగా ఛాన్స్ కొట్టేసిన 'ఉప్పెన' బ్యూటీ!

Raja Deluxe movie update
  • కృతి శెట్టికి యూత్ లో క్రేజ్ 
  • ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ సొంతం 
  • లైన్లో మరో మూడు సినిమాలు
  • సూర్య సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ
అందానికి అదృష్టం తోడైతే ఎలా ఉంటుందని అడిగేవారికి అందుకు ఉదాహరణగా కృతి శెట్టిని చూపించవచ్చు. ఇండస్ట్రీలోకి ఈ సుందరి అడుగుపెట్టిన వేళా విశేషం బాగుంది. ఒక సినిమా తరువాత ఒకటిగా పొలోమంటూ అవకాశాలు వచ్చి ఒళ్లో వాలిపోతున్నాయి. ఈ భామ కూడా కెరియర్ పై పూర్తి క్లారిటీతోనే ఉంది. 

ఇప్పటికే హ్యాట్రిక్ హిట్ కొట్టిన కృతి, ఈ ఏడాదితోనే మరో మూడు సినిమాల ద్వారా యూత్ ను పలకరించనుంది. ఆ జాబితాలో 'ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి' .. 'ది వారియర్' .. 'మాచర్ల నియోజక వర్గం' సినిమాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే సూర్య - బాల కాంబినేషన్లో రూపొందే సినిమాలో రెండవ కథానాయికగా ఎంపికైందని అంటున్నారు. 

అంతేకాదు .. ఏకంగా ప్రభాస్ జోడీగా ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు. ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి 'రాజా డీలక్స్' సినిమాను రూపొందించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ సరసన ముగ్గురు నాయికలు కనిపించనున్నారు. కృతి శెట్టిని ఒక కథానాయికగా .. మాళవిక మోహనన్ ను మరో కథానాయికగా తీసుకున్నారట. మరో కథానాయికగా ఎవరిని ఎంచుకుంటారనేది చూడాలి.
Prabhas
Krithi Shetty
Mruthi
Raja Deluxe Movie

More Telugu News