Perni Nani: 60 ఏళ్లు దాటిన వారికి ఆర్టీసీ బస్సు చార్జీలలో రాయితీ పునరుద్ధరణ: ఏపీ మంత్రి పేర్ని నాని

Senior citizens can avail 25 percent concession on RTC tickets says Perni Nani

  • ఏప్రిల్ నుంచి ఆర్టీసీ టికెట్ ధరలో 25 శాతం రాయితీ ఇస్తామన్న పేర్ని నాని
  • వయసు నిర్ధారణకు గుర్తింపు కార్డు చూపించి రాయితీ పొందవచ్చని వ్యాఖ్య
  • ఆర్టీసీలో కారుణ్య నియామకాలు చేపడతామని వెల్లడి


అరవై ఏళ్లు దాటిన వారికి ఆర్టీసీ టికెట్ ధరలో 25 శాతం రాయితీని మళ్లీ ఇవ్వబోతున్నట్టు ఏపీ రవాణాశాఖ మంత్రి పేర్ని నాని ప్రకటించారు. గతంలో కొవిడ్ కారణంగా నిలిపివేసిన ఈ రాయితీని సీనియర్ సిటిజన్లకు వచ్చే నెల నుంచి పునరుద్ధరిస్తున్నట్టు మంత్రి తెలిపారు. వయసు నిర్ధారణ కోసం ఆధార్, ఓటరు ఐడీ తదితర ఏదైనా గుర్తింపు కార్డును చూపించి రాయితీ పొందవచ్చని తెలిపారు. 

ఇక ఇతర శాఖల మాదిరే ఆర్టీసీలో కూడా కారుణ్య నియామకాలను చేపడతామని చెప్పారు. 1,800కు పైగా కారుణ్య నియామకాలను గ్రామ, వార్డు సచివాలయాలతో పాటు మిగిలిన శాఖల్లో ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారని తెలిపారు. ఆర్టీసీ బస్సులకు బయటి బంకుల నుంచి పెట్రోల్ కొనుగోలు చేయాలని నిర్ణయించామని చెప్పారు. దీనివల్ల ఆర్టీసీకి రోజుకు రూ. 1.50 కోట్లు ఆదా అవుతుందని తెలిపారు. తిరుమల ఘాట్ రోడ్డు, తిరుపతి-మదనపల్లి, తిరుపతి-నెల్లూరుకు ఎలక్ట్రిక్ బస్సులు తిప్పుతామని చెప్పారు.

  • Loading...

More Telugu News