South Korea: దక్షిణకొరియాను వణికిస్తున్న కరోనా... ఒకే రోజు 4 లక్షలకు పైగా కేసుల నమోదు!

South Korea records more than 4 lakh cases in a single day
  • దక్షిణ కొరియాలో విరుచుకుపడుతున్న కరోనా
  • గత 24 గంటల్లో 4,00,741 పాజిటివ్ కేసులు
  • 76 లక్షలకు చేరుకున్న మొత్తం కేసుల సంఖ్య
దక్షిణకొరియాను కరోనా మహమ్మారి వణికిస్తోంది. కేవలం ఒకే రోజులో 4 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. గత 24 గంటల్లో కొత్తగా 4,00,741 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని దక్షిణకొరియా ప్రభుత్వం వెల్లడించింది. కరోనా ప్రారంభమైనప్పటి నుంచి ఇంతటి భారీ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. గత 24 గంటల్లో 293 మంది మృతి చెందారు. తాజా కేసులతో కలిపి సౌత్ కొరియాలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 76 లక్షలకు చేరుకుంది.
South Korea
Corona Virus

More Telugu News