Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ చనిపోయిన విషయం ఆయన మేనత్తకు ఇప్పటికీ తెలియదట!

Puneeth Rajkumar aunty is still unaware of his death
  • పునీత్ అంటే మేనత్త నాగమ్మకు పంచ ప్రాణాలు
  • మరణం విషయం ఆమెకు తెలియకుండా కుటుంబసభ్యుల జాగ్రత్త
  • పునీత్ ఔట్ డోర్ షూటింగ్ లో ఉన్నాడని చెపుతున్న కుటుంబసభ్యులు
కన్నడ స్టార్ హీరో పునీత్ కుమార్ మరణాన్ని ఇప్పటికే ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయన మృతి చెంది నాలుగు నెలలు గడిచిపోయినా ఆ షాక్ నుంచి ఇంకా తేరుకోలేకపోతున్నారు. 46 ఏళ్ల చిన్న వయసులోనే పునీత్ గుండెపోటుతో మరణించారు. 

మరోవైపు పునీత్ మృతి చెందిన విషయాన్ని ఆయన మేనత్త నాగమ్మకు ఇప్పటి వరకు చెప్పలేదట. పునీత్ తండ్రి, కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కు నాగమ్మ సొంత చెల్లెలు. తన మేనల్లుడు పునీత్ అంటే ఆమెకు పంచ ప్రాణాలు. ఆమె వయసు 90 ఏళ్లు. పునీత్ మరణించాడనే వార్తను విని ఆమె తట్టుకోలేదన్న ఉద్దేశంతో, ఇంతవరకు ఆ విషయాన్ని గోప్యంగానే ఉంచారు. పునీత్ గురించి ఆమె అడిగినప్పుడల్లా ఔట్ డోర్ షూటింగ్ లో ఉన్నాడని చెపుతున్నారట. ఈ విషయాన్ని వారి కుటుంబసభ్యుల్లో ఒకరు వెల్లడించారు.
Puneeth Rajkumar
Aunty

More Telugu News