Vanajeevi Ramaiah: ప్రమాదంలో గాయపడిన వనజీవి రామయ్య... అయినా మొక్కలపై మమకారం!
- ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి వద్ద ఘటన
- మొక్కలకు నీళ్లు పోసేందుకు వెళ్లిన రామయ్య
- ప్రమాదానికి గురైన ద్విచక్రవాహనం
- రామయ్య కాలుకు తీవ్ర గాయం
- నెల రోజులు విశ్రాంతి తీసుకోవాలన్న వైద్యులు
వృక్ష సీమలు, ప్రకృతిపై అపారమైన ప్రేమ కనబరిచే పర్యావరణ ఉద్యమకారుడు వనజీవి రామయ్య (దరిపల్లి రామయ్య) ఖమ్మం జిల్లాలో ఓ ప్రమాదంలో గాయపడ్డారు. రెడ్డిపల్లి బైపాస్ రోడ్డు వద్ద తాను నాటిన మొక్కలకు నీళ్లు పోసేందుకు ద్విచక్రవాహనంపై వెళుతుండగా, ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆయన కాలుకు తీవ్ర గాయమైంది. వైద్యులు చికిత్స చేసి, నెలరోజుల విశ్రాంతి తప్పనిసరి అని పేర్కొన్నారు.
అయితే, నీళ్లు పోయకపోతే తాను నాటిన మొక్కలు చనిపోతాయని అంటున్న వనజీవి రామయ్య... గాయమైన కాలుతోనే వెళ్లి ఆ మొక్కలకు నీళ్లు పోస్తున్నారు. మొక్కలను ప్రాణప్రదంగా ప్రేమించే వనజీవి రామయ్య గత 50 ఏళ్లుగా మొక్కలు నాటుతున్నారు. ఆయన సేవలను కేంద్రం గుర్తించి 2017లో పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది.