Bheemla Naik: డిస్నీ ప్లస్ హాట్ స్టార్ తో పాటు.. మరో ఓటీటీలోనూ ‘భీమ్లా నాయక్’

Bheemla Naik To Be Streaming On Aha Too
  • ఒకేసారి రెండు ఓటీటీల్లో విడుదల
  • ‘ఆహా’లోనూ లాలా సందడి 
  • మార్చి 25 నుంచి స్ట్రీమింగ్
  • ‘పవర్ స్టార్మ్’ వస్తున్నాడంటూ ఆహా ట్వీట్
మలయాళ సినిమా ‘అయ్యప్పనుమ్ కోషియమ్’కు రీమేక్ గా వచ్చిన సినిమా ‘భీమ్లా నాయక్’. పవన్ కల్యాణ్, రానాలు పోటాపోటీగా నటించిన ఈ సినిమా.. థియేటర్లలో ఇప్పటికే మాంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పుడు బుల్లితెరలపైనా అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఈ సినిమాను స్ట్రీమ్ చేయనున్న సంగతి తెలిసిందే. 

హాట్ స్టార్ తో పాటు మరో ఓటీటీలోనూ భీమ్లా నాయక్ ను స్ట్రీమ్ చేయనున్నట్టు చిత్ర బృందం ప్రకటించింది. ‘ఆహా’లోనూ ఈ నెల 25 నుంచే పవర్ ప్యాక్డ్ ‘భీమ్లా నాయక్’ అందరికీ మరింత చేరువ కానుంది. అటు డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఇటు ఆహా.. ఒకేసారి రెండు ఓటీటీల్లో సినిమా విడుదలవుతుండడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు. 

ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆహా, డిస్నీప్లస్ హాట్ స్టార్ లు ట్వీట్ కూడా చేశాయి. ‘‘వచ్చే శుక్రవారం ఈ టైమ్ కి.. ‘పవర్ స్టార్మ్’ మీ ఇంటికి వచ్చేస్తుంది. తేదీలను గుర్తుపెట్టుకోండి.. క్యాలెండర్ ను ఖాళీగా ఉంచుకోండి.. మార్చి 25 నుంచే మీ ఆహాలో భీమ్లా నాయక్’’ అని పేర్కొంటూ ఆహా ట్వీట్ చేసింది. 

‘‘హాట్ స్టార్ లోకి భీమ్లానాయక్ వచ్చేస్తున్నాడు.. మార్చి 25 నుంచి అధికారం, కర్తవ్యం మధ్య తిరుగులేని యుద్ధానికి అంతా సిద్ధం కండి’’ అంటూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ట్వీట్ చేసింది. 

కాగా, ఈ సినిమాలో హీరోయిన్లుగా నిత్యా మేనన్, సంయుక్తా మేనన్ లు నటించారు. సాగర్ కె. చంద్ర డైరెక్ట్ చేయగా.. మాటలు, కథనాన్ని త్రివిక్రమ్ శ్రీనివాస్ అందించారు. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మించారు. తమన్ ఇచ్చిన స్వరాలు ఏ లెవెల్లో ఉన్నాయో తెలిసిందే.
Bheemla Naik
Pawan Kalyan
Rana Daggubati
Tollywood
Aha

More Telugu News