Amitabh Bachchan: అమితాబ్ నర్మగర్భ వ్యాఖ్యలు.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

Netizens Trolling Amitabh For His Indirect Comments On Kashimir Files
  • ‘కశ్మీర్ ఫైల్స్’ పేరు లేకుండా బిగ్ బీ ట్వీట్
  • గతంలో మనం చూడనివి ఎన్నో ఉన్నాయి
  • అవన్నీ ఇప్పుడు తెలిసొస్తున్నాయంటూ ట్వీట్
  • అంత భయమెందుకంటూ నెటిజన్ల విమర్శలు
ప్రస్తుతం బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘ద కశ్మీర్ ఫైల్స్’ సినిమా విజయవంతంగా దూసుకెళ్తోంది. కశ్మీరీ పండిట్లపై జరిగిన అరాచకాలను కళ్లకు కడుతూ తీసిన సినిమాపై ప్రముఖులంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా దానిపై స్పందించారు కానీ, నర్మగర్భ వ్యాఖ్యలు మాత్రం చేశారు. దీంతో నెటిజన్లు ఆయనపై విరుచుకుపడుతున్నారు. మరీ అంత భయమెందుకంటూ ట్రోల్స్ చేస్తున్నారు. 

‘‘అప్పుడు మనకు తెలియని విషయాలెన్నో.. ఇప్పుడు మనకు తెలిసొస్తున్నాయి’’ అంటూ బిగ్ బీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో కశ్మీర్ ఫైల్స్ అని ఎక్కడా సినిమా పేరు ప్రస్తావించలేదు. దీంతో చాలా మంది అభిమానులు ఆయన తీరును ఖండిస్తూ బదులిచ్చారు. పరోక్షంగా చెప్పే బదులు.. ట్వీట్ లో సినిమా పేరు పెట్టవచ్చు కదా అంటూ కామెంట్ చేస్తున్నారు. 

‘‘ఏదో చెప్పలేదనకుండా ముక్తసరి వ్యాఖ్యలు చేస్తున్నారా? లేదంటే భయం వల్ల పేరు చెప్పడం లేదా?’’ అని మరో యూజర్ ట్రోల్ చేశాడు. ‘‘మీరు కూడా భలే మాయ చేస్తారు’’ అంటూ మరో యూజర్ వ్యాఖ్యానించాడు.
Amitabh Bachchan
Bollywood
The Kashmir Files

More Telugu News