Bhadrachalam: భద్రాచలంలో ప్రారంభమైన శ్రీరామనవమి వేడుకలు

Sree Rama Navami celebrations starts in Bhadrachalam

  • పాల్గుణ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి విశేష పూజలు
  • పసుపు దంచే కార్యక్రమాన్ని నిర్వహించిన అర్చకులు
  • ఏప్రిల్ 10న సీతారాముల కల్యాణోత్సవం

భద్రాద్రి శ్రీసీతారామచంద్రుల వారి శ్రీరామనవమి వేడుకలు ఈరోజు ప్రారంభమయ్యాయి. పాల్గుణ పౌర్ణమి సందర్భంగా ఈరోజు స్వామివారికి విశేష పూజలను నిర్వహించారు. ప్రధాన ఆలయంలోని మూలమూర్తులు, ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. 

ఆలయంలోని చిత్రకూట మండపంలో వైష్ణవ సంప్రదాయం ప్రకారం స్థానాచార్యులు స్థల సాయి నేతృత్వంలో రోలు, రోకలికి దేవతలను ఆవాహన చేసి, పసుపు దంచే కార్యక్రమాన్ని నిర్వహించారు. అలా తయారు చేసిన పసుపుతో తలంబ్రాలను సిద్ధం చేశారు. ఏప్రిల్ 9న సీతారాములుకు ఎదుర్కోలు ఉత్సవం, 10న కల్యాణోత్సవం, 11న పట్టాభిషేక మహోత్సవ కార్యక్రమాలు జరగనున్నాయి.

  • Loading...

More Telugu News