Prakash Raj: 'ది కశ్మీర్ ఫైల్స్’పై ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Prakash Raj comments on The Kashmir Files
  • కశ్మీర్ ఫైల్స్ చిత్రం పాత గాయాలను నయం చేస్తుందా?
  • లేక మరింత రెచ్చగొట్టేలా చేస్తుందా?
  • లేదంటే ద్వేషం అనే విత్తనాలను నాటుతుందా?
'ది కశ్మీర్ ఫైల్స్' చిత్రం సంచలనాన్ని సృష్టిస్తోంది. జమ్మూకశ్మీర్ లో 1990లలో కశ్మీరీ పండిట్లపై జరిగిన దారుణాలను ఈ చిత్రంలో తెరకెక్కించారు. మరోవైపు ఈ చిత్రంపై ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'కశ్మీర్ ఫైల్స్ చిత్రం పాత గాయాలను నయం చేస్తుందా? లేక మరింత రెచ్చగొట్టేలా చేస్తుందా? లేదంటే ద్వేషం అనే విత్తనాలను నాటుతుందా? జస్ట్ ఆస్కింగ్' అని ట్వీట్ చేశారు. 

మరోవైపు ఈ చిత్రం భారీ వసూళ్లను రాబడుతోంది. బీజేపీ నేతలు ఈ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రధాన మోదీ నుంచి ఎందరో బీజేపీ నేతలు సినిమాపై ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రానికి కొన్ని రాష్ట్రాలు బెనెఫిట్స్ కూడా ప్రకటించాయి. ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ చేసిన వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాయి. ఇంకోవైపు ఈ చిత్ర దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రికి కేంద్ర హోంశాఖ 'వై' కేటగిరీ భద్రతను కల్పించింది.
Prakash Raj
Tollywood
The Kashmir Files

More Telugu News