Low Pressure: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం... కోస్తాంధ్రకు వర్షసూచన
- అండమాన్ వద్ద అల్పపీడన పరిస్థితులు
- రేపటిలోగా పూర్తిస్థాయి అల్పపీడనం
- బంగ్లాదేశ్, మయన్మార్ దిశగా వెళ్లే సూచనలు
- తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
అండమాన్ తీరం వద్ద ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఏర్పడినట్టు వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది రేపటిలోగా పూర్తిస్థాయిలో అల్పపీడనంగా మారుతుందని వెల్లడించింది. ఆపై క్రమంగా బలపడి బంగ్లాదేశ్, మయన్మార్ దిశగా వెళుతుందని వివరించింది.
దీని ప్రభావంతో కోస్తాంధ్ర, ఒడిశా తీర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.