Dalai Lama: రెండేళ్లుగా క‌నిపించని ద‌లైలామా.. ఇప్పుడిలా ఉన్నారు!

dalai lama First Public Appearance After Over 2 Years
  • క‌రోనా నేప‌థ్యంలో బ‌య‌ట‌కే రాని ద‌లైలామా
  • శుక్ర‌వారం బ‌య‌ట‌కు వ‌చ్చిన వైనం
  • వైద్యుల‌తో బాక్సింగ్ అడుతున్నాన‌ని వెల్ల‌డి
బౌద్ధ గురువు ద‌లైలామా రెండేళ్లుగా అస‌లు క‌నిపించ‌డ‌మే లేదు. అప్పుడెప్పుడో క‌రోనా విజృంభ‌ణ‌కు ముందు వైద్య చికిత్స‌ల కోసం ఢిల్లీ వ‌చ్చినప్పుడు క‌నిపించిన ద‌లైలామా.. ఆ త‌ర్వాత అస‌లు జ‌నం ముందుకే రాలేదు. ధ‌ర్మ‌స్థ‌లిలోనే ఉంటున్న ద‌లైలామా.. క‌రోనా విజృంభ‌ణ‌తో పాటు అనారోగ్య కార‌ణాల వ‌ల్లే బ‌య‌ట‌కు రావ‌ట్లేద‌న్న భావ‌న వ్య‌క్తమైంది.

తాజాగా రెండేళ్ల త‌న అజ్ఞాత వాసాన్ని వీడిన ద‌లైలామా శుక్ర‌వారం ద‌ర్శ‌న‌మిచ్చారు. ధ‌ర్మ‌స్థ‌లిలోని త‌న శిష్యుల ముందుకు వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు ఆసక్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. వైద్య ప‌రీక్ష‌ల కోసం తాను ఢిల్లీ వెళ్లాల్సి ఉంద‌ని పేర్కొన్న ఆయ‌న‌.. త‌న ప‌ర్య‌ట‌న‌ను వాయిదా వేసుకున్న‌ట్లు తెలిపారు. ఇప్పుడు త‌న ఆరోగ్యం కుదురుగానే ఉంద‌ని, వైద్యుల‌తో తాను బాక్సింగ్ కూడా ఆడుతున్నాన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.
Dalai Lama
Corona Virus
Dharma Sthali

More Telugu News