Congress: కేసీఆర్‌పై నిరుద్యోగుల్లో వ్య‌తిరేక‌త‌: కాంగ్రెస్ పార్టీ నేత దాసోజు శ్ర‌వ‌ణ్‌

dasoju sravan fires on kcr

  • పీకే స‌ర్వేల్లోనే వ్య‌తిరేక‌త‌ తేలింది
  • ఆ నివేదిక‌తోనే వేల ఉద్యోగాలంటూ కేసీఆర్ ప్ర‌క‌ట‌న‌
  • బోర్డుల ద్వారా నియామ‌కాలంటే టీఆర్ఎస్ నేత‌ల‌కు పంచ‌డ‌మే
  • రాష్ట్రంలో నిరుద్యోగ ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించాలన్న దాసోజు

తెలంగాణ సీఎం కేసీఆర్‌పైనా, ఆయ‌న పార్టీపైనా రాష్ట్రంలోని నిరుద్యోగుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త ఉంద‌ని కాంగ్రెస్ పార్టీ నేత‌, ఏఐసీసీ అధికార ప్ర‌తినిధి దాసోజు శ్ర‌వ‌ణ్ వ్యాఖ్యానించారు. ఈ విష‌యాన్ని తాము చెప్ప‌డం లేద‌ని, ఎన్నిక‌ల్లో గెలుపు వ్యూహాలు ర‌చించ‌డానికి కేసీఆర్ నియ‌మించుకున్న రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోరే త‌న స‌ర్వేలో తేల్చార‌ని శ్ర‌వ‌ణ్ అన్నారు. 

రాష్ట్ర యువ‌త‌లో కేసీఆర్ ప‌ట్ల తీవ్ర వ్య‌తిరేక‌త ఉన్న విష‌యాన్ని ఇప్ప‌టికే కేసీఆర్‌కు ప్ర‌శాంత్ కిశోర్ అంద‌జేశార‌ని కూడా ఆయ‌న చెప్పారు. ఈ క్ర‌మంలోనే 91,142 ఉద్యోగాల భ‌ర్తీ అంటూ కేసీఆర్ ప్రక‌ట‌న చేశార‌ని శ్ర‌వ‌ణ్ చెప్పుకొచ్చారు. 

కేసీఆర్ ప్ర‌క‌టించిన ఉద్యోగాల్లో కొన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా, మరికొన్ని బోర్డుల ద్వారా భ‌ర్తీ చేస్తామని చెప్పార‌ని గుర్తు చేసిన శ్ర‌వ‌ణ్‌... ప్రభుత్వ ఉద్యోగాల్లో బోర్డుల ద్వారా నియామకాలు అంటే టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను పెట్టడానికి కుట్ర జరుగుతుందని మ‌రో వ్యాఖ్య చేశారు.

 టీఎస్పీఎస్సీని నిర్వీర్యం చేసే దిశ‌గా కుట్ర జ‌రుగుతోంద‌ని.. అందులో భాగంగానే 300 మంది పనిచేసే చోట కేవలం 80 మందితోనే ప‌ని చేయిస్తున్నార‌న్నారు. రాష్ట్రంలో నిరుద్యోగ ఎమర్జెన్సీ ప్రకటించాలన్న శ్ర‌వ‌ణ్‌.. నిరుద్యోగ భృతి రూ.3 వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News