Maharashtra: పూణెలో అమానవీయ ఘటన.. బాలికపై ఐదేళ్లుగా తండ్రి, అన్న అత్యాచారం

Father and brother raped 11 year old girl in Pune
  • స్కూల్‌లో నిర్వహించిన గుడ్‌టచ్ బ్యాడ్ టచ్ కార్యక్రమం ద్వారా వెలుగులోకి
  • తాత, మామయ్య కూడా బాలికపై లైంగిక వేధింపులు
  • పోక్సో చట్టం కింద నిందితులపై కేసు నమోదు
సొంత తండ్రి, తోడబుట్టిన వాడే ఆమె పాలిట రాక్షసంగా ప్రవర్తించారు. ఐదేళ్లుగా ఆమెను చెరబడుతున్నారు. దీనికితోడు తాత, మామయ్య కూడా లైంగిక వేధింపులకు గురిచేశారు. మహారాష్ట్రంలోని పూణెలో జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చి సంచలనం రేపింది. పోలీసుల కథనం ప్రకారం.. బాధిత బాలిక (11) కుటుంబం బీహార్ నుంచి వలస వచ్చి పూణెలో ఉంటోంది. బాలిక స్థానికంగా ఓ పాఠశాలలో చదువుకుంటోంది.

బడిలో ఇటీవల ‘గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్’  కార్యక్రమం నిర్వహిస్తూ బాలికలకు అవగాహన కల్పిస్తుండగా బాలిక తనపై జరిగిన అఘాయిత్యాన్ని బయటపెట్టింది. 2017 నుంచి తండ్రే ఆమెపై అఘాయిత్యానికి పాల్పడుతుండగా 2020లో సోదరుడు కూడా నీచానికి దిగజారాడు. అంతేకాదు, బాలిక తాత, మామయ్య కూడా లైంగిక వేధింపులకు గురిచేశారు. అయితే, ఇది సామూహిక అత్యాచారం కాదని, వేర్వేరు సమయాల్లో వీరంతా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Maharashtra
Pune
Girl
Rape case
Pocso Act

More Telugu News