Somu Veerraju: టీడీపీతో పొత్తు ఉంటుందని మేమెక్కడా చెప్పలేదు: సోము వీర్రాజు

Somu Veerraju clarifies alliance with TDP
  • కర్నూలులో బీజేపీ శిక్షణ కార్యక్రమం
  • హాజరైన సోము వీర్రాజు
  • టీడీపీతో పొత్తు కథనాలు మీడియా సృష్టి అని వెల్లడి
  • జనసేనతో కలిసి ఎన్నికలకు వెళతామని స్పష్టీకరణ
కర్నూలులో నేడు బీజేపీ రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమంలో బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన టీడీపీతో పొత్తు ఊహాగానాలపై స్పష్టత ఇచ్చారు. టీడీపీతో తాము పొత్తు కుదుర్చుకుంటామని ఎక్కడా చెప్పలేదన్నారు. అదంతా కేవలం మీడియా కల్పితమేనని ఆరోపించారు. తమకు జనసేనతోనే పొత్తు ఉందని, ఆ పార్టీతో కలిసి ఎన్నికలకు వెళతామని సోము వీర్రాజు వెల్లడించారు. ఇక, ఏపీలో ఎన్నికలకు సంబంధించి బీజేపీ రోడ్ మ్యాప్ సిద్ధమవుతోందని తెలిపారు. 

ఇటీవలే జనసేనాని పవన్ కల్యాణ్.... ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు బీజేపీ రోడ్ మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నామని అన్నారు. పైగా, ఈసారి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ప్రసక్తేలేదన్నారు. దాంతో, బీజేపీ-జనసేన కూటమితో టీడీపీ కూడా కలుస్తుందేమోనన్న ఊహాగానాలు బయల్దేరాయి. అయితే, సోము వీర్రాజు తాజా వ్యాఖ్యలతో ఇప్పటివరకు పొత్తు ప్రతిపాదనలేవీ లేవన్న విషయం అర్థమవుతోంది.
Somu Veerraju
TDP
BJP
Alliance
Janasena
Andhra Pradesh

More Telugu News