sensex: ద్రవ్యోల్బణం పెరిగిపోతుందనే ఆందోళన.. భారీ నష్టాల్లో ముగిసిన మార్కెట్లు
- రష్యా యుద్ధంతో పెరుగుతున్న క్రూడాయిల్ ధర
- ద్రవ్యోల్బణం భయాలతో అమ్మకాలకు మొగ్గుచూపిన ఇన్వెస్టర్లు
- 571 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం నేపథ్యంలో చమురు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడాయిల్ ధర 110 డాలర్లకు చేరుకుంది. దీంతో ద్రవ్యోల్బణం పెరుగుతుందనే ఆందోళన ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీసింది. పర్యవసానంగా అమ్మకాలకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 571 పాయింట్లు నష్టపోయి 57,292కి పడిపోయింది. నిఫ్టీ 169 పాయింట్లు కోల్పోయి 17,117 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
సన్ ఫార్మా (0.41%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (0.52%), ఎన్టీపీసీ (0.15%), మారుతి (0.15%), టైటాన్ (0.06%).
టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (-2.93%), ఏసియన్ పెయింట్స్ (-2.85%), అల్ట్రాటెక్ సిమెంట్ (-2.74%), నెస్లే ఇండియా (-2.49%), హిందుస్థాన్ యూనిలీవర్ (-2.41%).