TPCC President: జ‌గ్గారెడ్డికి షాక్‌.. వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌ బాధ్య‌త‌ల్లో కోత‌

tpcc cuts jaggareddy responsibilities
  • రేవంత్‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు దిశ‌గా జ‌గ్గారెడ్డి
  • జ‌గ్గారెడ్డి బాధ్య‌త‌ల‌కు క‌త్తెరేసిన రేవంత్ రెడ్డి
  • అంజ‌న్‌, అజార్‌, మ‌హేశ్ గౌడ్‌ల‌కు "కోత"ల‌ బాధ్య‌త‌లు
టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వ్య‌తిరేకంగా దూకుడు ప్ర‌ద‌ర్శిస్తున్న టీ పీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జ‌య‌ప్ర‌కాశ్ రెడ్డి (జ‌గ్గారెడ్డి)కి సోమ‌వారం షాక్ త‌గిలింది. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయ‌న‌కు క‌ట్ట‌బెట్టిన బాధ్య‌త‌ల‌పై కోత‌ను విధిస్తూ టీపీసీసీ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఆయనకు అప్పగించిన పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు, అనుబంధ సంఘాల బాధ్యతల నుంచి ఆయ‌న‌ను తప్పించేసింది.

ఇక జ‌గ్గారెడ్డి నుంచి తొల‌గించిన బాధ్య‌త‌ల‌ను కొత్త‌గా అంజ‌న్ కుమార్ యాద‌వ్‌, మ‌హ్మ‌ద్ అజారుద్దీన్‌, మ‌హేశ్ గౌడ్‌ల‌కు అప్ప‌గిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నిర్ణ‌యం తీసుకున్నారు. రేవంత్‌పై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసే దిశ‌గా క‌దులుతున్న జ‌గ్గారెడ్డికి బ్రేకులేయ‌డ‌మే ల‌క్ష్యంగా ఈ చ‌ర్య‌లు తీసుకున్న‌ట్లుగా స‌మాచారం. ఈ చ‌ర్య‌ల‌పై జ‌గ్గారెడ్డి స్పంద‌న ఎలా ఉంటుంద‌న్న‌ది చూడాలి! 
TPCC President
Jagga Reddy
Congress

More Telugu News