RRR: 70కి పైగా కార్లతో 'ఆర్ఆర్ఆర్' ఆకృతి... మెల్బోర్న్ లో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సందడి

NTR fans in Melbourne began celebrations in the wake of RRR grand release
  • ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా ఆర్ఆర్ఆర్
  • ఈ నెల 25న విడుదల
  • విదేశాల్లోనూ సందడి వాతావరణం
  • ఎన్టీఆర్ పై అభిమానాన్ని చాటుకున్న మెల్బోర్న్ ఫ్యాన్స్
ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుండడంతో, తారక్, చరణ్ అభిమానుల్లో కోలాహలం పతాకస్థాయికి చేరుకుంది. ఆస్ట్రేలియాలోనూ ఆర్ఆర్ఆర్ సందడి నెలకొంది. మెల్బోర్న్ లో ఎన్టీఆర్ అభిమానులు 70కి పైగా కార్లతో ఆర్ఆర్ఆర్ ఆకృతిని ప్రదర్శించారు. అంతేకాదు జై ఎన్టీఆర్ అనే అక్షరాలను కూడా కార్ల ద్వారా ప్రదర్శించారు. నినాదాలు చేస్తూ  ఎన్టీఆర్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ డ్రోన్ వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.
RRR
Jr NTR
Fans
Melbourne
Australia

More Telugu News