Jawahar: మద్యం అమ్మకాలు తగ్గితే, ఆదాయం 200 శాతం ఎలా పెరిగింది?: ఏపీ మాజీ మంత్రి జవహర్

TDP leader Jawar fires on jagan govt

  • రజత్ భార్గవ తప్పుడు ప్రకటనలు మానుకోవాలి
  • జగన్ అసెంబ్లీ ప్రకటనకు జిరాక్స్ ప్రకటనలా ఉంది
  • సారా మరణాలను సహజ మరణాలుగా చిత్రీకరించే యత్నమన్న జవహర్ 

ఏపీలో మద్యం అమ్మకాలు గణనీయంగా తగ్గాయని చెబుతున్న ప్రభుత్వం.. దానిపై ఆదాయం ఏకంగా 200 శాతం పెరిగిందని చెప్పడంపై టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్ మండిపడ్డారు. అమ్మకాలు తగ్గితే ఆదాయం ఎలా పెరుగుతుందని సూటిగా ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు ప్రకటనలు మానుకోవాలని ఎక్సైజ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవకు హితవు పలికారు. రజత్‌భార్గవ్ ప్రకటన సీఎం జగన్ అసెంబ్లీ ప్రకటనకు జిరాక్స్‌లా ఉందని మండిపడ్డారు. 

సారా మరణాలను కూడా సహజ మరణాలుగా చిత్రీకరిస్తూ ఆయన మాట్లాడడం మృతుల కుటుంబాల్ని అవమానించడమేనని అన్నారు. సారాను అదుపు చేయలేని కమిషనర్ తప్పుడు ప్రకటనలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో అమలు చేసిన నవోదయం కార్యక్రమాన్ని అటకెక్కించి ఇప్పుడు ప్రభుత్వానికి వంత పాడతారా? అని జవహర్ మండిపడ్డారు.

  • Loading...

More Telugu News