Alina Kabaeva: పుతిన్ ప్రేయసిని స్విట్జర్లాండ్ నుంచి బహిష్కరించాలి.... 50 వేల మంది సంతకాలతో పిటిషన్

A petition filed to expel Alina Kabaeva from Switzerland

  • ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం
  • కుటుంబీకులను దేశం దాటించిన పుతిన్!
  • స్విట్జర్లాండ్ లో భారీ భద్రత మధ్య ప్రేయసి

ఉక్రెయిన్ పై రష్యా దాడులకు శ్రీకారం చుట్టకముందే అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తన కుటుంబీకులను దేశం దాటించారన్న ప్రచారం జరుగుతోంది. పుతిన్ ప్రేయసిగా భావిస్తున్న మాజీ జిమ్నాస్ట్ అలీనా కబయేవాను కూడా ఆమె పిల్లలతో సహా స్విట్జర్లాండ్ కు పంపించినట్టు తెలుస్తోంది. 

38 ఏళ్ల కబయేవా స్విట్జర్లాండ్ లోని ఓ అందమైన విల్లాలో భారీ భద్రత మధ్య తన సంతానంతో కలిసి ఉంటోందని వివిధ వర్గాలు భావిస్తున్నాయి. అయితే, అలీనాను స్విట్జర్లాండ్ నుంచి పంపించేయాలంటూ రష్యా, ఉక్రెయిన్, బెలారస్ దేశాలకు చెందిన వారు చేంజ్ డాట్ ఆర్గ్ (change.org)లో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కు మద్దతు తెలుపుతూ ఇప్పటిదాకా 50 వేల మంది వరకు సంతకాలు చేశారు. 

కాగా, అలీనా సన్నిహితులు కొందరు ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం ముగించే అంశం ఆమె చేతుల్లోనే ఉందని భావిస్తున్నారట. యుద్ధాన్ని ఆపాలని పుతిన్ కు అలీనానే నచ్చచెప్పాలని, అందుకోసం ఆమె స్విట్జర్లాండ్ ను వీడి మాస్కో వెళ్లాలని వారు సూచిస్తున్నారు. ఎవరు చెప్పినా వినని పుతిన్... అలీనా మాట వింటారని వారు బలంగా నమ్ముతున్నారు.

  • Loading...

More Telugu News