Delhi: పరమ చెత్త రికార్డును మూటకట్టుకున్న దేశ రాజధాని ఢిల్లీ!
- అత్యంత కలుషిత రాజధానిగా వరుసగా రెండో సారి అగ్ర స్థానంలో ఇండియా
- అత్యంత కలుషిత దేశాల్లో టాప్ ఫైవ్ లో ఉన్న భారత్
- వివరాలను వెల్లడించిన వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్
ప్రపంచంలోనే అత్యంత కలుషితమైన దేశ రాజధానిగా ఢిల్లీ నిలిచింది. ఈ పరమ చెత్త రికార్డును ఢిల్లీ సాధించడం ఇది వరుసగా రెండోసారి. ఢిల్లీ తర్వాతి స్థానాల్లో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా, ఛాద్ రాజధాని ఎంజమేనా, తజికిస్థాన్ రాజధాని దుషాంబే, ఒమన్ రాజధాని మస్కట్ ఉన్నాయి.
ప్రపంచంలోని 6,475 నగరాల డేటా ఆధారంగా ఈ వివరాలను వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ వెల్లడించింది. ప్రపంచంలోని ఏ ఒక్క దేశం కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలను పాటించడం లేదని డేటా స్పష్టం చేస్తోంది. కేవలం న్యూ కాలడోనియా, యూఎస్ వర్జిన్ ఐలాండ్స్, ప్యూర్టోరీకో మాత్రమే ప్రపంచ ఆరోగ్య సంస్థ పీఎం2.5 ఎయిర్ క్వాలిటీ గైడ్ లైన్స్ ను అందుకున్నాయి. మరోవైపు ప్రపంచంలో అత్యంత కలుషితమైన ఐదు దేశాల్లో భారత్ కూడా ఉండటం విచారించదగ్గ విషయం.