RRR: చరిత్రలో నిలిచిపోతుంది... 'ఆర్ఆర్ఆర్' సినిమాపై ఉమైర్ సంధూ రివ్యూ!

Umair Sandhu review on RRR movie

  • రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్
  • ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా భారీ చిత్రం
  • ఈ చిత్రాన్ని చూశానన్న ఉమైర్ సంధూ
  • ఎన్టీఆర్-రామ్ చరణ్ ది తిరుగులేని జోడీ అని వెల్లడి

దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి నుంచి వస్తున్న మరో భారీ చిత్రం ఆర్ఆర్ఆర్ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా రూపుదిద్దుకున్న ఈ చిత్రంపై అంచనాలు ఓ రేంజికి చేరాయి. ఈ నేపథ్యంలో సినీ విమర్శకుడు, ఓవర్సీస్ సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధూ ఆర్ఆర్ఆర్ చిత్రంపై రివ్యూ ఇచ్చారు. 

"ఓ భారతీయ ఫిలింమేకర్ సత్తాకు నిదర్శనం ఈ చిత్రం. పెద్ద కలలు కనడమే కాదు, వాటిని సాకారం చేసుకునే క్రమంలో అందరూ గర్వపడేలా ఈ చిత్రం తీశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను చూడకుండా ఉండొద్దు. ఇవాళ దీన్ని బాక్సాఫీసు బ్లాక్ బస్టర్ అనుకోవచ్చేమో గానీ, రేపు మాత్రం ఇదొక క్లాసిక్ లా చరిత్రలో నిలిచిపోతుంది. ఇదొక పవర్ ప్యాక్డ్ స్టోరీ. జూనియర్ ఎన్టీర్, రామ్ చరణ్ ల నటన అద్వితీయం. 

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎంతో థ్రిల్లింగ్ గా ఉంది. మొదటి నుంచి చివరి సీన్ వరకు నిర్మాణ విలువలు ప్రతిబింబించేలా ఆర్ఆర్ఆర్ చిత్రం ఉంది. ప్రతి నటుడు అత్యున్నత ప్రతిభ కనబర్చారు. ముఖ్యంగా, జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాకు గుండెకాయ లాంటివాడు. అతని పెర్ఫార్మెన్స్ చూస్తే మతిపోతుంది. రామ్ చరణ్ కూడా ఏం తక్కువ కాదు... సమ్మోహితులను చేశాడు. సినిమా మొత్తమ్మీద అందరి మనసు చూరగొంటాడు. ఎన్టీఆర్-రామ్ చరణ్ ది తిరుగులేని జోడీ. 

ఈ సినిమాలో అజయ్ దేవగణ్ ఒక సర్ ప్రైజ్ ప్యాకేజి. తన పాత్రకు జీవం పోశాడు. తన పాత్రకు న్యాయం చేసిన అలియాభట్ ఈ చిత్రంలో ఎంతో అందంగా కనిపించింది. ఇక ఎస్ఎస్ రాజమౌళి ఈ సినిమాతో అధికారికంగా భారత్ లో నెంబర్ వన్ డైరెక్టర్ అనిపించుకుంటారు" అంటూ ఉమైర్ సంధూ సోషల్ మీడియాలో తన రివ్యూ వెలువరించారు.

ఆర్ఆర్ఆర్ కు స్టోరీ, స్క్రీన్ ప్లేనే రియల్ హీరో అని అభివర్ణించారు. 3 గంటల పాటు ప్రేక్షకుడ్ని కట్టిపడేస్తుందని పేర్కొన్నారు. అందుకే ఈ చిత్రానికి 5/5 రేటింగ్ ఇస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News