YS Sharmila: పాదయాత్రలో తేనెటీగల దాడి నుంచి షర్మిలను కాపాడిన సెక్యూరిటీ!

Honeybees attacked in YS Sharmila padayatra

  • యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతున్న షర్మిల పాదయాత్ర
  • దుర్శగానిపల్లి గ్రామంలో దాడి చేసిన తేనెటీగలు
  • తేనెటీగల దాడిలో పలువురు కార్యకర్తలకు గాయాలు

తెలంగాణలో తన తండ్రి వైయస్ రాజశేఖరరెడ్డి పాలనను మళ్లీ తీసుకురావాలనే లక్ష్యంతో షర్మిల ప్రజాప్రస్థానం పాదయాత్రను చేపట్టిన సంగతి తెలిసిందే. ఆమె పాదయాత్రకు ప్రజల్లో మంచి ఆదరణ లభిస్తోంది. యాత్ర సందర్భంగా ప్రతి ఒక్కరినీ ఆమె ఆత్మీయంగా పలకరిస్తూ.. టీఆర్ఎస్ ను విమర్శిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం ఆమె పాదయాత్ర యాదాద్రి భువనగిరి జిల్లాలో కొనసాగుతోంది. అయితే పాదయాత్ర సందర్భంగా స్వల్ప అపశ్రుతి చోటుచేసుకుంది.  

మోట కొండూరు మండలం నుంచి ఆత్మకూరు మండలానికి వెళ్తున్న క్రమంలో దుర్శగానిపల్లి గ్రామం వద్ద ఒక చెట్టు కింద గ్రామస్తులతో షర్మిల మాట్లాడుతుండగా.. తేనెటీగలు దాడి చేశాయి. అయితే ఆమె సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తమై... ఆమెను సురక్షితంగా కాపాడారు. ఇదే సమయంలో పలువులు వైయస్సార్టీపీ కార్యకర్తలు స్వల్పంగా గాయపడ్డారు. ఇప్పటివరకు షర్మిల పాదయాత్ర 400 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. మరోవైపు మోటకొండూరు మండలం చండేపల్లి గ్రామంలో రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు.

  • Loading...

More Telugu News