Sensex: పెట్రోల్, డీజిల్ ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన మార్కెట్లు!
- 89 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
- 22 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
- 5 శాతం వరకు పెరిగిన డాక్టర్ రెడ్డీస్ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి. ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఈ నాటి ట్రేడింగ్ ఆద్యంతం లాభనష్టాల్లో కొనసాగాయి. కోవిడ్ నిబంధనలపై కేంద్ర ప్రభుత్వం నిబంధనలను సడలిస్తుండటం ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపినప్పటికీ... చమురు ధరలు మళ్లీ పెరుగుతుండటం వాళ్ల సెంటిమెంటును దెబ్బతీసింది. దీంతో, మార్కెట్లు చివరకు నష్టాల్లో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 89 పాయింట్లు నష్టపోయి 57,595కి పడిపోయింది. నిఫ్టీ 23 పాయింట్లు కోల్పోయి 17,222 వద్ద స్థిరపడింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (4.90%), అల్ట్రాటెక్ సిమెంట్ (1.77%), టెక్ మహీంద్రా (1.75%), రిలయన్స్ (1.50%), టాటా స్టీల్ (1.48%).
టాప్ లూజర్స్:
కోటక్ బ్యాంక్ (-3.09%), టైటాన్ (-2.63%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-2.23%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.94%), హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ (-1.50%).