Yogi Adityanath: రేపే యోగి ప్రమాణ స్వీకారం.. హాజరవుతున్న రాజకీయ, సినీ, వ్యాపార దిగ్గజాలు వీరే!

list of celebrities attending Yogi Adityanath oath taking ceremony
  • రెండో సారి సీఎం బాధ్యతలను చేపట్టబోతున్న యోగి ఆదిత్యనాథ్
  • రేపు సాయంత్రం లక్నోలో ప్రమాణస్వీకారం
  • ముఖ్య అతిథిగా హాజరుకానున్న మోదీ
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ రెండో సారి బాధ్యతలను స్వీకరించబోతున్నారు. రేపు సాయంత్రం 4 గంటలకు లక్నోలోని ఎకానా స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ విచ్చేస్తున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, ఉపముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. 

బాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద సంఖ్యలో హాజరుకాబోతున్నారు. కంగనా రనౌత్, అక్షయ్ కుమార్, అజయ్ దేవగణ్ , బోనీ కపూర్, అనుపమ్ ఖేర్, దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తదితరులు ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరవుతున్నారు. 

వ్యాపార దిగ్గజాలు ముఖేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, కుమార్ మంగళం బిర్లా, ఆనంద్ మహీంద్రా, సంజీవ్ గోయంకా, ఎన్ చంద్రశేఖర్ లకు కూడా ఆహ్వాన పత్రికలు అందాయి. వీరిలో కొందరు విచ్చేసే అవకాశం ఉంది. 13 అఖాడాల ప్రతినిధులు రానున్నారు. మొత్తంమీద 20 వేల మంది ప్రమాణస్వీకారానికి రానున్నట్టు బీజేపీ వర్గాలు తెలిపాయి.
Yogi Adityanath
Oath
Celebrities
Narendra Modi
BJP

More Telugu News